Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్క కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంది.. అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ,తెలుగు రాష్ట్రాల అభిమానులుతో పాటు ఎన్నో భాషల్లో ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి హీరోకి అర్జున్ కూతురు పెళ్లిలో.. జరిగిన అవమానం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..
రజనీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతోమంది సినిమా అభిమానులు.. ఆయన్ను దేవుడిలా కొలుస్తుంటారు. ఆయన స్టైల్ గా నడిచి వస్తే చాలు.. ఇక అభిమానులందరూ విజిల్స్ తో హోరెత్తిస్తారు. ఆయన సినిమా విడుదలవుతోంది అంటే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది.
ఇక సినిమా హీరోలు సైతం.. ఆయన తమ కార్యక్రమానికి అలా వచ్చి వెళ్తే చాలు.. అదే పదివేలు అనుకుంటారు. ఈ నేపథ్యంలో.. ఓ ఈవెంట్ కు వెళ్ళిన సూపర్ స్టార్ కు చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
పాపులర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు ఈ మధ్యనే నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇరువైపులా కుటుంబాలు అంగీకరించడంతో.. పెళ్లితో ఏకమయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి గత కొద్ది రోజుల క్రితం గుడిలో సింపుల్ గా జరిగింది.
చెన్నైలో అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో.. వీరిద్దరి వివాహం జరిపాడు. కాగా ఈ పెళ్ళికి సమీప బంధువులు మాత్రమే వచ్చారు. దాంతో ఇండస్ట్రీ అంతటికి. ఇతర బంధువులకు భారీ ఎత్తున ఈ మధ్యనే రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు రజనీకాంత్ సైతం హాజరయ్యారు. అయితే ఈ రిసెప్షన్లో రజినీకాంత్ కి అనుకోని ఒక పరిస్థితి ఏర్పడింది.
సూపర్ స్టార్ రజనీకాంత్.. తన మొదటి కూతురు.. ఐశ్వర్యతో కలిసి ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. అనంతరం వేదికపైకి వచ్చిన రజినీకాంత్.. వధూవరులను అభినందించి.. తాను వారికి తీసుకొచ్చిన బహుమతిని వారికి అందించారు. అయితే రజినీకాంత్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ని.. ఆ జంటతో పాటు అర్జున్.. సోదరుడు రామయ్య ఫ్యామిలీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో దాన్నిపక్కన పెట్టేశారు రజిని.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో.. రజిని అభిమానులు నిరాశకు గురవుతున్నారు. రజినీ తెచ్చిన గిఫ్ట్ ని.. అక్కడ ఎవరూ పట్టించుకోలేదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ సైతం పెడుతున్నాడు.