Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఇండిగో ఎయిర్ లైన్స్ సేవల్లో టెక్నికల్ సమస్యల కారణంగా విమాన సేవల్లో ఆటంకం ఏర్పడింది. దీంతో చాలామంది ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం గంటలోనే సమస్య పరిష్కారమవుతది అనుకున్నారు కానీ, ఇప్పటికీ సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగోపై తక్షణ యాక్షన్ తీసుకోవాలని ఎక్స్ వేదికగా ప్రయాణీకులు గగ్గోలు పెట్టకుంటున్నారు. చెక్ ఇన్‌లు ఆలస్యం అవుతున్నాయని త్వరలో సేవలను పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది.
వెబ్‌సైట్ నెట్‌వర్కింగ్ నెమ్మదిగా పనిచేయడం వల్ల మా సేవల్లో ఆటంకం కలిగిందిజ బుకింగ్ లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనివల్ల ఇండిగో ప్రయాణీకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వాళ్ల ప్రయాణానికి ఆలస్యం అవుతుంది. చెక్ ఇన్ ప్రక్రియ కూడా నెమ్మదించడం వల్ల ఈ సమస్య పెరిగింది అని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది ఇండిగో.
త్వరలోనే సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. దేశవ్యాప్తంగా 2000 పైగా ఇండిగో విమాన సేవలను అందిస్తోంది. ఇందులో అంతర్జాతీయ సేవలు కూడా అందిస్తుంది ఇండిగో. సర్వీస్ లో అంతరాయం ఏర్పడటం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వారి గమ్య స్థానానికి అనుకున్న సమయానికి చేరుకోలేకపోయారు. చెక్ ఇన్ ల క్యూ కూడా భారీగా పెరిగింది. దీంతో గంటల కొద్దీ ప్రయాణీకులు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఇండిగో ఎయిర్ లైన్స్ మొత్తంపై ఈ సమస్య తలెత్తింది. దీంతో సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సేవలు ఆలస్యంగానే కొనసాగుతున్నాయి.