Jupiter Retrograde Transit 2024: నవ గ్రహాల్లో ఎంతో ప్రసిద్ధి ఉన్న గ్రహం బృహస్పతి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి జ్ఞానం, వివేకం, ధర్మంకు చిహ్నం. హిందూ పురాణాలలో బృహస్పతిని దేవతల గురువుగా, పురోహితుడిగా పూజిస్తారు. సాధారణంగా బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 13 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం అక్టోబర్ 9న వృషభ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమనం మేష రాశి వారిపైన తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒక రాశి నుంచి మరో రాశిలో మారేందుకు శని తర్వాత ఎక్కువ సమయం తీసుకొనే గ్రహం బృహస్పతి. బృహస్పతి జ్ఞానంకు ప్రతీక. బృహస్పతి శుభ స్థానంలో ఉన్నప్పుడు జీవితంలో ఆనందం, సంపద, శక్తి అన్నిటిని అందిస్తాడు. ఎట్టు వంటి పనిని తలెత్తిన విజయవంతంగా పూర్తి చేస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 9న వృషభ రాశిలో బృహస్పతి గ్రహం తిరోగమనం చేయబోతుంది. ఇప్పటికే గురు గ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ తిరోగమనం వల్ల కొన్ని రాశులవారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సంచారం కారణంగా విద్య, వైవాహిక, వృత్తి జీవితాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ రాశి వారికి పైన బృహస్పతి గ్రహం ప్రభావం ఎలా ఉంటుంది. తిరోగమనం వల్ల ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
మేష రాశి: బృహస్పతి తిరోగమనం మేష రాశి వారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో కొంతవరకు బలహీనపరిచే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు.
వృషభ రాశి: ఈ రాశివారు పెట్టుబడులు, వ్యాపారం వంటి వాటిలో నష్టాలు ఎదుర్కొంటారు. ఆస్తుల విషయాల్లో వివాదాలు. స్నేహితుల మధ్య విభేదాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృషభ రాశివారు ఇష్టదైవారధ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి: బృహస్పతి తిరోగమనం వల్ల కర్కాటక రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కొంత తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రుతువులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి తగ్గి, మానసికంగా కలవరపడే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు రాకపోవచ్చు.
మకర రాశి: ఈ రాశివారికి చర్మ, శరీర సమస్యలు కలుగుతాయి. ఆర్థకంగా నష్టపోతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి.