Another Cyclone on October 22: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ముప్పు తొలగిపోక ముందే మరో విపత్తు ముంచుకు రానుంది. బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
మధ్య బంగాళాఖాతం, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఈ నెల 20వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం మయన్మార్, థాయిలాండ్ మీదుగా మధ్య అండమాన్‌లోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ మార్టబాన్, అరకాన్ కోస్ట్ గుండా పయనించనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ అల్పపీడన ద్రోణి తీవ్ర తుపాను మారితే బంగాళాఖాతం మధ్య నుంచి వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది తిరిగి అక్టోబర్ 22 తెల్లవారుజాము వరకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 23వ తేదీ ఒడిశా, ఆంధ్రప్రదేవ్ తీరానికి చేరే అవకాశం ఉంది. అయితే, దీని ప్రభావం ఎక్కువ శాతం సముద్రంలో మాత్రమే కొనసాగుతుంది.
కానీ, 24వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా మారవచ్చు తీవ్ర తుపానుగా మారుతుందా? అనేది ఇప్పుడే అంచనా వేయలేమని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఒక వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారితే మాత్రం ఈ సీజన్లో మొదటి తుపాను అవుతుంది.
ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మయన్మార్ తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఒకవేళ తీవ్ర తుపాను మారినా ఇంకా సమయం ఉంది. కానీ, వాతావరణ శాఖ ముందుగానే ఈ తుపాను గురించిన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 22న అయితే, తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈనెల అక్టోబర్ 19వ తేదీ తర్వాత మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో ఏర్పడే అల్పపీడనం మాత్రం ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.