School Teachers: పాఠశాల దుర్మార్గ చర్య.. హోం వర్క్‌ చేయలేదని పిల్లల బట్టలిప్పి శిక్ష

School Teachers Crucial Treat On Students: దసరా పండుగ సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల పైశాచికత్వం ప్రదర్శించింది. హోం వర్క్‌ పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థుల చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చొబెట్టి దారుణానికి ఒడిగట్టింది. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1 /7

విద్యార్థులపై ప్రైవేటు పాఠశాల దారుణానికి పాల్పడింది. చిన్నారులపై కర్కశంగా వ్యవహరించింది.

2 /7

మేడ్చల్ జిల్లాలోని  పూడూరు గ్రామంలోని సెయింట్‌ మేరిస్ పాఠశాల నిర్వాహకులు చిన్నారులను కఠినంగా శిక్షించారు.

3 /7

హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను చొక్కాలు వినిపించి మోకాళ్లపై కూర్చోబెట్టిన పాఠశాల యాజమాన్యం.

4 /7

దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను భారీ శిక్ష వేశారు.

5 /7

దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలకు వచ్చినా హోం వర్క్‌ పూర్తి చేయకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

6 /7

సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చిన ఆందోళన చేపట్టారు.

7 /7

విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్న దృశ్యాలను కవరేజ్ చేస్తున్న మీడియా సెల్‌ ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసిన పాఠశాల సిబ్బంది. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.