Holi Festival2024: హోలీ రోజున ఈ పరిహారాలు పాటిస్తే.. జీవితమంతా రంగులమయమే ఇంకా..

Holi 2024: మన దేశంలో అనేక పండుగలు, సంప్రదాయాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో హోలీని ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడాలేకుండా అందరు ప్రత్యేకమైన రంగులతో హోలీవేడుకను నిర్వహించుకుంటారు.

1 /7

హోలీ పండుగ వచ్చేసింది. ఈ పండుగను అన్నివయసుల వారు ఫుల్ జోష్ తో జరుపుకుంటారు. హోలీని నేచురల్ రంగులతో చేసుకొవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గులాల్, కౌవ్ ఢంగ్ తో చేసిన రంగులను ఉపయోగించాలి..

2 /7

కొందరు కెమికల్స్ తో చేసిన రంగులను తమ ముఖాలకు పూసుకుంటారు. దీని వల్ల చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి. హోలీరోజు ఉదయాన్నేముఖానికి, శరీరంఅంతా నూనె పెట్టుకొవాలి. దీంతో రంగులు తొందరగా వెళ్లిపోతాయి.  

3 /7

హోలీరోజున ఉదయాన్నేలేచి స్నానంపూర్తిచేసుకొని దేవుడి దగ్గర దీపారాధాన చేయాలి. మొదట దేవుడి చిత్రపటం మీద గులాల్ తో అలకరించాలి. ఒక ఎరుపు బట్ట తీసుకుని దానిలో పొక,కాయిన్ ను పెట్టి ముడివేయాలి.

4 /7

ఇలాముడివేసిన బట్టను మన లాకర్ లోపెట్టుకొవాలి. వచ్చే ఏడాది వరకు కూడా దాన్ని తీయకుండా జాగ్రత్తగా చూసుకొవాలి. ఇలా చేస్తే ఇంట్లో క్రమంగా డబ్బు వచ్చి చేరుతుంది.   

5 /7

హోలీ రోజున ఇంట్లో రంగులు పూసుకుంటారు.  ఆసమయంలో కొన్నిజాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకొవాలి. రంగులు కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. దీనిలో రసాయనాల వల్ల కళ్లు మండుతాయి. 

6 /7

కొందరు రంగులు పెట్టుకొవడం వల్ల ముఖంమీద అలర్జీలు, దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు రంగులకు దూరంగా ఉండాలి. హోలీరోజున పేదలకు డబ్బులు, స్వీట్లు దానంగా ఇస్తే మనకు మంచి జరుగుతుంది.  

7 /7

హోలీ రోజున రావి చెట్టుదగ్గరకు వెళ్లి, దాని అడుగు భాగంలో ఉండే చీమలకు చక్కెరను వేయాలి.బెల్లం వేసిన కూడా మంచి రిజల్ట్ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)