Hing Benefits: ఇంగువ మన వంటింటి కిచెన్‌లో నిత్యం ఉంటుంది. దీంతో కూరలకు అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇంగువలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంగువను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రొంప సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు సీజనల్ వ్యాధుల బారినపడకుండా పడకుండా ఉంటారు.
జీర్ణక్రియ.. ఇంగువ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆల్కలైన్ తగ్గించే గుణం ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ కాకుండా నివారించే ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంగువ డైట్లో చేర్చుకోవడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు ప్రోత్సహిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు.. ఇంగువలో టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది.
జలుబు, దగ్గు.. ఇంగువలో యాంటీ అలెర్జీన్ గుణాలు ఉంటాయి. ఇంగువను తరచూ మన డైట్లో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గుకు తక్షణ రెమిడగా పనిచేస్తుంది. ఇంగువలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఫ్లూ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
అజీర్తి.. ఇంగువలో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టే గుణం ఉంటుంది. అంతేకాదు ఇంగువలో యాంటీస్మాస్మోడిక్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు అజీర్తి సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తాయి.
బీపీ.. ప్రతిరోజూ మన డైట్లో ఇంగువ తీసుకవడం వల్ల హైపర్ టెన్షన్ సమస్య తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తుంది. మీ డైలీ డైట్లో ఇంగువను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )