Peacock feather effect: చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు. దీని వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు.
నెమలి ఈకలను కొందరు ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా హాల్ లో, దేవుడి పూజగదిలో నెమల ఈకలను తప్పకుండా పెట్టుకుంటారు.శ్రీకృష్ణుడు నెమలి పింఛంను ధరించాడు.అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి సైతం.. నెమలిని తన వాహనంగా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నెమలిని తమ ఇళ్లలో పెట్టుకుంటే ప్రతికూలతలు అన్ని దూరమైపోతాయంట. ఇంట్లో కొందరికి ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతుంటాయి. పూర్తిగా అశాంతికర వాతావరణం ఉంటుంది. ఏపని చేసిన కూడా కలిసి రాదు.ఇలాంటి వారు నెమలి పింఛంను పెట్టుకొవాలంటారు.
పీడ కలలతో బాధపడేవారు.. తమ పరుపు పిల్లో కింద నెమలీ ఈకలు పెట్టుకుంటే దుష్టశక్తుల ప్రభావం ఉండదంటారు. అదే విధంగా నెమల అనేది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీనీ దూరం చేస్తుందంట. అందుకే ఇది ఇంట్లో పెట్టుకొవాలంట.
నెమలీకి ధనాన్ని ఆకర్శించే గుణం ఉంటుందంట. దీన్నిమనం డబ్బులుపెట్టే లాకర్ గదిలో ఉంచితే.. కూడా డబ్బులకు ఎప్పుడు కూడా కొదువ ఉండదని చెప్తుంటారు. బైటకు వెళ్లేవారు.. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు నెమలిని చూసి వెళితే, ఆ పని సక్సెస్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
ఇంట్లో పాముల బాధలు, పాముల స్వప్నాలతో బాధపడేవారు బెడ్ రూమ్ లో నెమలీ పింఛంను ఉంచుకుంటే, ఈ చెడు ప్రభావం నుంచి బైటపడిపోతుంటారు. కొందరు తాము చదివే బుక్ లలో .. నెమలి ఈకలను పెట్టుకుంటారు. దీని వల్ల కూడా చదువు బాగా వస్తుందని నమ్ముతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)