Golden Chariot Train tour: మహారాజభోగాలతో దక్షిణ బారతదేశ పర్యటన చేయాలనుందా..

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ గోల్డెన్ ఛారియట్ తిరిగి ప్రారంభమైంది. ఈ ట్రైన్‌లో ప్రయాణమంటే రాజభోగమే. రాజ భోగాల్ని తలపించే లగ్జరీ ఉంటుంది. స్పెషల్ ప్యాకేజ్ ద్వారా బుక్ చేసుకుని దక్షిణ భారతదేశ పర్యటన, ముఖ్యంగా గోవా సౌందర్యాన్ని తిలకించవచ్చు.

  • Mar 15, 2021, 23:05 PM IST

Golden Chariot Train tour: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ గోల్డెన్ ఛారియట్ తిరిగి ప్రారంభమైంది. ఈ ట్రైన్‌లో ప్రయాణమంటే రాజభోగమే. రాజ భోగాల్ని తలపించే లగ్జరీ ఉంటుంది. స్పెషల్ ప్యాకేజ్ ద్వారా బుక్ చేసుకుని దక్షిణ భారతదేశ పర్యటన, ముఖ్యంగా గోవా సౌందర్యాన్ని తిలకించవచ్చు.
 

1 /5

గోల్డెన్ ఛారియట్ ట్రైన్ మార్చ్ 14 నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ ట్రైన్ బెంగళూరు నుంచి ప్రారంభమై..తమిళనాడు, కర్నాటక, కేరళ, గోవా మీదుగా తిరిగి బెంగళూరు చేరుకుంటుంది.

2 /5

గోల్డెన్ ఛారియన్ ట్రైన్‌కు మరో పేరు గోల్డెన్ రధం కూడా. పేరుకు తగ్గట్టే ఈ ట్రైన్‌ల రాజసం ఒలికించే ఫర్నీచర్, బ్రహ్మాండమైన గదులు, బాత్రూమ్, అద్భుతమైన ఇంటీరియన్ డిజైనింగ్ ఉంటుంది. ట్రైన్‌లో ప్రయాణిస్తూ రాజసం అనుభవించవచ్చు.

3 /5

కర్నాటక కీర్తిగా ఉన్న గోల్డెన్ ఛారియట్  ఒక ప్యాకేజ్  6 రాత్రులు 7 రోజులు ఉంటుంది. ఇందులో ట్రైన్ బెంగళూరు నుంచి ప్రారంభమై బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, చిక్‌మంగళూర్, హంపి, ఏహోల్, పట్టాడ్‌కల్, గోవా మీదుగా తిరిగి బెంగళూరు చేరుకుంటుంది. రెండవ ప్యాకేజ్  3 రాత్రులు 4 రోజులుంటుంది. ఇందులో బెంగళూరు నుంచి మైసూరు, హంపి, మహాబలిపురం మీదుగా తిరిగి వస్తుంది. 

4 /5

ఇద్దరు వ్యక్తులండే ఒక కేబిన్ ప్రైస్ 2 లక్షల 8 వేల 90 రూపాయలు మాత్రమే. అటు సింగిల్ పర్సన్‌కు అయితే 1 లక్ష 56 వేల 70 రూపాయలుగా నిర్ణయించారు. అద్దెలో 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా బుకింగ్ చేసుకుంటే రిటర్న్ ఎయిర్ టికెట్  బహుమతిగా లభిస్తుంది.

5 /5

ఈ రాజసపు ట్రైన్‌ను 2008లో కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. తరువాత దీన్ని ఐఆర్సీటీసీ నిర్వహిస్తూ వచ్చింది. ఈ ట్రైన్  బుకింగ్ అధికారిక వెబ్ సైట్ www.goldenchariot.orgలో వెళ్లి చేయవచ్చు.