Gold Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ధర ఎంత పెరిగిందంటే?

Gold Rates Today:  గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తాజా ధరలు చూస్తే షాక్ తగలడం ఖాయం. ఇటీవల వరుసగా పెరిగి కిందటి రోజు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. బుధవారం తగ్గి ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. జనవరి 16వ తేదీ గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /6

Gold Rates Today:   బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి బిగ్ షాక్. ఈమధ్య వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత వారం వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధరరూ. 1300కు పైగా పెరిగింది. కిందటి రోజు మాత్రం స్వల్పంగా రూ. 100 మాత్రమే దిగివచ్చింది. ఇక వరుసగా తగ్గుతుందేమోనని చూసినవారికి నిరాశే ఎదురయ్యింది. మళ్లీ నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

2 /6

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కిందటి రోజుతో పోల్చితే భారీగా ఎగబాకాయి. దేశీయంగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా కిందటి రోజుతో పోలిస్తే పెరిగాయి. ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.   

3 /6

అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర చూస్తే ఔన్సుకు మళ్లీ 2700 డాలర్ల స్థాయికి పెరిగింది. కిందటి రోజు ఇది 2670 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. 30 డాలర్ల దిగువన ఉండగా ఇప్పుడు 30.66 డాలర్లకు చేరుకుంది. ఇక డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 86.49దగ్గర కొనసాగుతోంది. 

4 /6

దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరరూ. 100 పెరిగింది. ఇప్పుడు తులం రూ. 73,400కుచేరుకుంది. దీనికి ముందు రోజు రూ. 100 తగ్గింది. మరోవైపు 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ. 110 పెరిగింది. 10 గ్రాములకు రూ. 80,070 దగ్గర కొనసాగుతోంది.

5 /6

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 పెరిగింది. ఇప్పుడు రూ. 73,550 వద్ద ఉంది. 24క్యారెట్ల బంగారం ధర తులం రూ. 80,220 దగ్గర ట్రేడ్ అవుతోంది.

6 /6

వెండి విషయానికి వస్తే కిందటి రోజు రూ. 2000 తగ్గింది. నేడు మళ్లీ రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో 1000 పెరిగడంతో కిలో వెండి రేటు ప్రస్తుతం 1.01 లక్షలకు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. కేజీకి రూ. 93,500కు చేరుకుంది.