Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో డ్యూయల్ రోల్లో నటించారు. కానీ త్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘ముగ్గురు మొనగాళ్లు’ అని ఆయన అభిమానులకు తెలుసు. కానీ మరో సినిమాలో చిరు .. మూడు పాత్రలు కనిపించి మెప్పించారు.
కానీ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమా కంటే ఓ సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. ఆ సినిమా దొంగ మొగుడు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దొంగ మొగుడు సినిమాలో చిరంజీవి.. పేదవాడిగా.. ధనవంతుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో భానుప్రియ కోసం మరో చిరంజీవి వస్తాడు. అంటే మూడో చిరంజీవి అన్న మాట.
దొంగ మొగుడు సినిమా చిరంజీవి నటించిన ద్విపాత్రాభినయం సినిమాగానే పరిగణించాలి. కానీ చివర్లో మూడో చిరంజీవి అతిథిగా కనిపిస్తాడు. సాంకేతికంగా చిరు యాక్ట్ చేసిన చిరు తొలి త్రిపాత్రాభినయం సినిమా ఇదే. ఇందులో మూడు పాత్రలు ఒకే సీన్ లో నటించిన సందర్భాలు లేవు.
ఇక చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను కే.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ నిర్మించారు.