Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..

Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
 

1 /5

సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నవారికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రిలిమ్స్‌ పాసైతే రూ. లక్ష రూపాయాలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. యూపీఎస్సీ సివిల్‌ సర్సీస్‌ ఎస్సీసీఎల్‌ ఆధ్వర్యంలో జరిగిన సివిల్స్‌ ప్రలిమ్స్‌ పాసైన వారు ఈ పథకానికి అర్హులు.  

2 /5

ఈ పథకాన్ని ప్రజాభవన్ వేదికగా ప్రారంభించారు. పోటీ పరీక్షల్లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.  

3 /5

అర్హత గల అభ్యర్థులు సులభంగా అప్లై చేసుకోవడానికి ఈ అభయహస్తం పథకాన్ని విడుదల చేశారు. సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమరీ ఎగ్జామినేషన్‌కు దాదాపు 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఏడాది దాదాపు 500 మంది ప్రిలిమ్స్‌ పాసవుతున్నారు.  

4 /5

అర్హత.. తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిగి ఉండాలి యూపీఎస్‌సీ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ పాసై ఉండాలి. కుటుంబ ఆదాయం రూ. 8 లక్షలు మించకూడదు.  వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు

5 /5

మూడు నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారు. వారి బాధలను అర్థం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే జాబ్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ కూడా పోస్ట్‌పోన్‌ చేశామన్నారు