Bhoomika: ఒకప్పటి పాపులర్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే!

Bhoomika mesmerizes with her latest Instagram pics: భూమిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్లు అందుకుంది. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి ఆమె అభిమానులు ఆమెతో ప్రేమలో పడుతున్నారు. 

1 /5

ఒకప్పుడు అందరూ స్టార్ హీరోస్ కి సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ భూమిక. అవును మీరు విన్నది నిజమే. మహేష్ బాబు.. ఒక్కడు ..జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి.. పవన్ కళ్యాణ్ ఖుషి.. లాంటి ఇండస్ట్రీ హిట్స్ అన్నిటిలో.. హీరోయిన్ గా నటించింది భూమికనే కావడం విశేషం.  

2 /5

అప్పట్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది ఈ హీరోయిన్. సుమంత్ యువకుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది భూమిక. ఆ తరువాత వరుస విషయాలు అందుకుంటూ వచ్చింది. 

3 /5

ముఖ్యంగా ఖుషి సినిమా భూమిక ను స్టార్ హీరోయిన్గా మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ఒక్కడు కూడా భూమిక కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం తెచ్చిపెట్టింది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ పద్ధతి అయిన పాత్రల్లో కనిపిస్తూ వచ్చింది ఈ హీరోయిన్. 

4 /5

భూమిక ఎక్కువగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించడం విశేషం. అందుకే ఆమెకి ఎంతోమంది ఫ్యామిలి ఆడియన్స్.. అభిమానులుగా నిలిచారు. కాగా మధ్యలో అవకాశాలు తగ్గి గ్యాప్ తీసుకున్న భూమిక. ఈమధ్య ఎంసీఏ.. పాగల్ లాంటి సినిమాలలో కనిపించింది.

5 /5

ఇక పాగల్ తరువాత భూమిక ఎటువంటి చిత్రంలో కనిపించలేదు. ఈ క్రమంలో భూమిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కొన్ని తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. భూమిక అందం ఇంకా ఏమాత్రం తగ్గలేదు.. అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.