Bharath Sanchar Nigam Limited: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్లో అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ శాతం మంది మొబైల్ వినియోగదారులు గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారు. బీఎస్ఎన్ఎల్ మరో అతి తక్కువ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు తీసుకు వచ్చింది.
మీరు బీఎస్ఎన్ఎల్ వినియోగదారలు అయితే అతి తక్కువ ధరలో ఎక్కువ కాలంపాటు వ్యాలిడిటీ పొందే ఆఫర్ గురించి చూస్తున్నట్లయితే ఈ 180 రోజుల వ్యాలిడిటీ మీకు బాగా సరిపోతుంది. ప్లాన్‌లో మీరు అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు.
రిలయన్స్, జియో, ఎయిర్టెల్ వొడాఫన్ఐడియా పెరిగన టెలికాం ధరలో నేపథ్యంలో మరింత ప్రియంగా మారాయి. దీంతో ఎక్కువ శాతం మంది ఆ ధరల పెరుగుదలను భరించలేక బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారు. మీరు కూడా ఈ ఆఫర్ ఎంచుకుంటే ఈ ప్లాన్‌పై ఓ లుక్కేయండి.
ఈ బీఎస్ఎన్ఎల్ 180 రోజుల రీఛార్జ్ ప్లాన్‌తో అపరిమిత కాల్స్, 90 జీబీ డేటా పొందుతారు ఇందులో మీరు ప్రతిరోజూ డేటా కూడా ఉచితంగా పొందుతారు. అయితే 90 జీబీ డేటా తర్వాత నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌లో మీరు అన్ని నెట్వర్ల్కకు కాల్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ రూ.897 ధరలో అందుబాటులో ఉంది. ఎక్కువ శాతం కాల్స్ చేసుకునే వారికి ఎంతో బెస్ట్ ప్లాన్.
అయితే రూ. 797 ప్లాన్‌తో 300 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా పొందుతారు. 100 ఎస్ఎంఎస్లు పొందుతారు. ఇందులో అపరిమి వాయిస్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్లు మొదటి 60 రోజులపాటు లభిస్తుంది.