Egg Gunta Ponganalu How To Making Process: టిఫిన్లు, స్నాక్స్ చేసుకోవాలంటే పెద్దగా కష్టపడని వంటకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి గుంత పొంగనాలు. ఇంట్లో గుడ్లు ఉంటే చాలు వేడివేడిగా.. యమ్మీగా పొంగనాలు వేసుకోవచ్చు. ఈ వంటకం ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. తయారీ ఇలా...
పది నిమిషాల్లో: ఇంట్లో టిఫిన్లు, స్నాక్స్ చేసుకోవడానికి సమయం లేదా? పదే పది నిమిషాల్లో యమ్మీ.. టేస్టీ వంటకం చేసుకోండి.
ఎంతో రుచికరం: గుడ్డుతో టేస్టీ.. యమ్మీ వంటకాన్ని సులువుగా.. అత్యంత త్వరగా చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: గుడ్లు, పచ్చిమిరపకాయ (లేకపోతే కొద్దిగా కారం పొడి), ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, అల్లం (కొద్దిగా) నూనె, కొత్తిమీర
ఆమ్లెట్ మాదిరి: గుడ్డు పొంగనాలు అచ్చం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా చేసుకోవాలి.
అన్నీ వేసి: ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి సోనా వేసుకోవాలి. దానిలో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ (లేకపోతే కొద్దిగా కారం పొడి), ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, అల్లం కలిపేయాలి.
కలపాలి: అన్నీ వేసుకుని బాగా చితక్కొట్టాలి. ఆమ్లెట్ మాదిరి ఎలా చేసుకుంటారో అలా కలపాలి.
సన్నని మంటపై: మీడియమ్ సైజ్ మంటతో పొంగనాల పాత్ర పొయ్యిపై పెట్టాలి. వేడయ్యాక గుంతలో నూనె వేయాలి. అనంతరం గుడ్డు మిశ్రమం అందులో వేయాలి.
బంగారు వర్ణం: వెంటనే మూతపెట్టి రెండు, మూడు నిమిషాలు చూడాలి. అనంతరం మళ్లీ తిప్పేయాలి. బంగారం రంగు వచ్చేంత వరకు చూస్తూ ఉండాలి.
ఏ చట్నీతోనైనా: బాగా కాలాక పాత్రలో నుంచి తీసేసి ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోండి. గుడ్డు గుంతనాల పొంగనాలకు పల్లీ లేదా పప్పులు, కొబ్బరి చట్నీ వేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది. లేదా చట్నీ లేకుండా కూడా ఎగ్ గుంత పొంగనాలు తినేయచ్చు.