Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం.. కొడుకులకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన మోహన్‌బాబు, ఆస్తి మొత్తం ఆమెకే..?

Manchu Family Issues: గత కొన్ని రోజులుగా మంచువారింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి కోసం ఈ గొడవ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ మోహన బాబు ఇతర ఆస్తుల గురించిన ఈ వివాదం జరుగుతుందని ఫిల్మ్‌ నగర్‌ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఆస్తి మొత్తం కొడుకులకు కాకుండా ఎవరికి రాయనున్నాడు? అనే రచ్చ జరుగుతుంది.
 

1 /7

మోహన్‌ బాబుకు ముగ్గురు సంతానం. మంచు విష్ణు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి. అయితే, వీరింట పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది మంచు మనోజ్‌కు మిగతా కుటుంబ సభ్యులకు. వివాదాలకు దూరంగా ఉండే మంచు మనోజ్‌ ఈరోజు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లకు కూడా తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.  

2 /7

ముఖ్యంగా మోహన్‌బాబుకు సంబంధించిన స్కూళ్లు, యూనివర్శిటీల్లో ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ వివాదం జరుగుతోందని తెలుస్తోంది. అయితే, మనోజ్‌ మాత్రం ఆస్తి కోసం కాదు పరువు తీస్తున్నారని అంటున్నారు. తన  

3 /7

ఓ వైపు మంచు మనోజ్‌పై విష్ణు బిజినెస్‌ భాగస్వామి అయిన ఓ వ్యక్తి దాడిచేశాడని తెలుస్తోంది. దీంతో గాయాలతో నడవలేని స్థితిలో మనోజ్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్‌ ఆసుపత్రికి తన భార్య మౌనిక, స్నేహితులు ఇతర బౌన్సర్లతో కలిసి వచ్చాడు.  

4 /7

ఆ తర్వాత తనకు ప్రాణహాని ఉందని పోలీస్‌ స్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్‌. నిన్న రాత్రి మోహన్‌ బాబు కూడా మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హాని ఉంది అని ఓ లేఖ విడుదల చేశారు.  

5 /7

దీంతో మంచు మనోజ్‌పై కేసు కూడా నమోదు చేశారు పహాడిషరిఫ్‌ పోలీసులు. ఫామ్ హౌస్‌లో మంచు విష్ణు, మనోజ్‌ బౌన్సర్లు మోహన్‌ బాబు చూస్తు ఉండగానే కొట్టుకున్న విజువల్స్‌ కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  

6 /7

ఈ వివాదం తెలుసుకున్న మంచు లక్ష్మి కూడా ముంబై నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే, కొన్ని రోజుల కిందట మోహన్ బాబు ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఆస్తి ముగ్గురికి సమాన వాటా ఉందని చెప్పారు  

7 /7

అయితే, ఎప్పటి నుంచో మంచు లక్ష్మికి మోహన్‌బాబు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న ఆస్తి వివాదం నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారితే ఆస్తి మొత్తం కూతురుకే రాసిస్తారేమోనని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.