Avoid 4 Foods for Cholesterol: మీకు కొలెస్ట్రాల్ ఉంటే ఈ 4 ఆహార పదార్థాలను ఎప్పుడూ ముట్టుకోకూడదు.. ఎందుకో తెలుసా..?

Avoid 4 Foods for Cholesterol: కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుండె సమస్యలు వస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.

Avoid 4 Foods for Cholesterol: కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుండె సమస్యలు వస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. దీనికి సరైన జీవనశైలిని అనుసరించాలి. ఇది ప్రాణాంతకం కాకముందే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

 కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి ప్రాణాంతకం కాకముందే దూరంగా ఉండాలి. ఇవి ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు వేయించన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానివేయాలని కాదు కానీ, తక్కువ మోతాదులో తీసుకోవడం మేలు 

2 /5

ముఖ్యంగా నూనెలో బాగా వేయించిన ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఈ ఆహారాలు కేలరీల సంఖ్యను పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కార్డియో సమస్యలను పెంచుతాయి.   

3 /5

ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. రెడ్ మాంసం, ఫ్రై చేసిన ఆహారాలు, ముఖ్యంగా సూపర్‌ మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.  

4 /5

అంతేకాదు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచే బీఫ్, గొర్రె మాంసం, పోర్క్ వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి ప్రాణాంతకంగా మారతాయి.  

5 /5

కొన్ని రకాల బేకరీ వస్తువులు తినడానికి పిల్లలు, పెద్దలు ఇష్టపడతారు. అంటే పేస్ట్రీ, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను ఇష్టపడతారు. ఈ ఆహారపదార్థాల్లో చక్కెర, వెన్న అధిక మొత్తంలో ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి. ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ మంచి డైట్ ఫాలో అవ్వాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )