AP High court: ఇక మీదట బైకర్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసు కేసు.. కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు..

Helmet must for 2-wheelers: ఇక మీదట టూవీలర్ వాహనాదారులు విధిగా హెల్మెట్ లు ధరించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ హెల్మెల్ పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే,  పోలీసు కేసు నమోదుచేయాలని సూచించింది.

1 /5

మనం ఉదయం లేవగానే ఏ చిన్న పని అయిన వెంటనే టూవీలర్ మీద బైటకు వెళ్లిపోతుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. దగ్గరి వరకు కదా.. అని హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తారు. కానీ రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి.

2 /5

ఆంధ్ర ప్రదేశ్ లో టూవీలర్ వాహనాలు నడిపే వారికి ఏపీ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.  ఇక మీదట బైక్ లు, స్కూటర్ లు, స్యూటీలు నడిపే వారు సైతం హెల్మెట్ లు ధరించాలని ఆదేశించింది. చాలా చోట్ల ఇప్పటికి కొందరు హెల్మెట్ లు లేకుండానే వాహనాలు నడిపిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. 

3 /5

గతంలో జరిగిన అనేక రోడ్డుప్రమాదాలలో మరణాలు హెల్మెట్ లు లేకపోవడంవల్లనే అంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో ఇక మీదట ఎవరైన టూవీలర్ లు హెల్మెట్ లు పెట్టుకొకపోతే..వెంటనే పోలీసుకేసు నమోదుచేయాలంటూ ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లు పెట్టుకొకపోతే కొందరు చూసి చూడనట్లు వదిలేసే వారు. మరికొందరు మాత్రం వీరిని పట్టుకుని జరిమాన విధించే వారు. 

4 /5

ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం టూవీలర్ వాహనదారులకు బిగ్ ట్విస్ట్ గా చెప్పుకొవచ్చు. న్యాయవాది యోగేష్ వేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం మరణాలు.. హెల్మెట్ లు పెట్టుకొకపోవడం వల్ల జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలోనే హెల్మెట్ తప్పనిసరి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

5 /5

ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైన కూడా హెల్మెట్ లు ధరించాలని పలువురు కోరుతున్నారు. తమ నెగ్లీజెన్సీ వల్ల రెప్పపాటులో కొన్ని జీవితాలు, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అందుకే బైటకు వెళ్లేటప్పుడు విధిగా హెల్మెట్ లు ధరించాలని పోలీసులు కోరుతున్నారు.