Eluru Incident: ఏలూరు ఆసుపత్రిలో వింతవ్యాధి బాధితుల్ని పరామర్శించిన వైఎస్ జగన్

  • Dec 07, 2020, 11:29 AM IST

 

Eluru Incident: కలవరం కలిగిస్తున్న ఏలూరు విషజ్వర బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. హెలీకాప్టర్ ద్వారా ఏలూరు చేరుకున్న వైఎస్ జగన్...నేరుగా వింత జ్వర బాధితులు చికిత్స పొందుతున్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. బాధితుల పక్కనే కూర్చుని పరామర్శించారు. 

1 /6

ఏలూరు ఘటనపై పరీక్షల కోసం ప్రత్యేక నిపుణుల బృందం ఏలూరుకు రానుంది. అటు కేంద్రం కూడా ఈ ఘటనపై స్పందించి..సహాయం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

2 /6

ఏలూరు వింతవ్యాధి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి ఆళ్లనాని, వైద్యాధికార్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్వస్థతకు దారితీసిన పరిస్థితులపై పరీక్షల చేసి కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.

3 /6

బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

4 /6

జడ్పీ సమావేశంలో సమీక్ష అనంతరం దేవరపల్లికి చేరుకుని..గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.

5 /6

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికార్లతో సమీక్ష నిర్వహించనున్నారు వైఎస్ జగన్.

6 /6

బాధితులకు భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దంటూ ధైర్యం కల్పించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు.