AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడటంతో ఏపీకి పెను తుఫాను ప్రమాదం తప్పినట్టు ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకు భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులు ఓ కారణమని తెలిపింది.
దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పినట్లైయంది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు.
రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.
వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం మార్నింగ్ వరకు విశాఖపట్నం, పార్వతీపురం మన్యం విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
నిన్న, మొన్న శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తగ్గాయి. మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.