Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం నుంచి ఒక వైపు ఇండస్ట్రీ నుంచి ఆయన నివాసానికి వచ్చి పరామర్శిస్తున్నారు.
అదే విధంగా, ఆయన నివాసం దగ్గర మాత్రం పెద్ద ఎత్తున సెలబ్రీటీలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా గందర గోళం తలెత్తకుండా పోలీసులు బందో బస్తు చేపట్టారు.
పుష్ప2 మూవీ టీమ్ కూడా అల్లు అర్జున్ ను కలిసిన వారిలో ఉన్నారంట. అయితే.. అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ తో మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఆరా తీశారంట. అదే విధంగా ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారంట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు.. నిన్న కూడా అల్లు అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలటలో దిల్ సుఖ్ నగర్ కు చెందని రేవతి అనే మహిళ మరణించింది. అదే విధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం.. ఘటన పట్ల మరోసారి కుటుంబానికి సారీ చెప్పినట్లు తెలుస్తొంది.