Amrapali: మోదీ సర్కారుకు బిగ్ షాక్.. బదిలీలపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలీ.. దెబ్బ అదుర్స్ కదా..

Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది.  దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
 

1 /6

తెలంగాణలో ప్రస్తుతం ఐపీఎస్, ఐఎఎస్ లు ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అధికారులు మాత్రం దీనిపై వెళ్లేందుకు ఏ మాత్రం సుముఖుంగా లేరని తెలుస్తోంది. 

2 /6

అయితే.. ముఖ్యంగా తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మాత్రం ఇక్కడ నుంచి కదలడానికి ససేమీరా అంటున్నారంట. ఆమెతో పాటు.. రొనాల్డ్ రాస్,  వాకాటి కరుణ, వాణి ప్రసాద్, అంజనీ కుమార్, ప్రశాంతి, శివశంకర్, హరికిరణ్, స్రజనలు ఉన్నారు.  

3 /6

ప్రస్తుతం   వీరంతా కేంద్రం డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని క్యాట్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమ్రపాలీ ఇటీవల జీహెచ్ఎంసీ పగ్గాలు చేపట్టారు. అంతేకాకుండా.. హైదరబాద్ డెవలప్ మెంట్ లో తనదైన మార్కు చూపిస్తున్నారు. 

4 /6

సీఎం రేవంత్ రెడ్డి సైతం.. ఆమ్రపాలీ మీదున్న నమ్మకంతో జీహెచ్ఎంసీ బాధ్యతల్ని కట్టబెట్టినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం  ఈ అధికారులు మాత్రం క్యాట్ ను ఆశ్రయించినట్లు తెలుస్తొంది. అంతేకాకుండా.. ముఖ్యంగా ఆమ్రపాలీ సీఎం రేవంత్ ను కలిసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారంట.

5 /6

అధికారులంతా తమకు తెలిసిన విధంగా ట్రాన్స్ ఫర్స్ ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. క్యాట్ ఆదేశాలు మాత్రం తమకు అనూకూలంగా వస్తాయని ఆమ్రపాలీతో పాటు మిగతా అధికారులు భావిస్తున్నారంట.

6 /6

ఇదిలా ఉండగా.. కేంద్రం కావాలని రేవంత్ సర్కారును ఇరుకున పెట్టేందుకు ఈ విధంగా  ఐపీఎస్ లు, ఐఏఎస్ లను ఏపీకి వెళ్లేలా వెనుక ఉండి.. కథ నడిపిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలొ డీవొపీటీ మాత్రం అక్టొబరు 16 వరకు డెడ్ లైన్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏమౌతుందో అని అందరిలో టెన్షన్ నెలకొంది.