Pushpa 2 Ticket rate hikes: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ . దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప 1’ ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పెంచిన టికెట్స్ రేట్స్ ఫ్యామిలీస్ కు భారంగా మారాయనే చెప్పాలి.
Pushpa 2 Ticket rate hikes: వీకెండ్ వస్తే చాలు..కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లే ప్రేక్షకులు చాలే మందే ఉంటారు. వచ్చే వీకెండ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చూద్దామనుకునే ప్రేక్షకులకు పెంచిన టికెట్ రేట్స్ భారంగా మారాయనే చెప్పాలి. ఒక రకంగా ఇప్పటికే మల్టీప్లెక్స్ లో తెలంగాణలో రూ. 295 ఉంది. ఇదే పెద్ద బొక్క అంటే.. పెంచిన టికెట్ రేట్స్ తో ఇక్కడ టికెట్ రేట్ రూ. 531కి చేరింది.
ముఖ్యంగా పుష్ప 2 టికెట్ రేట్స్ పెంచుకోవడానికీ తెలంగాణ ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చేసింది. ఈ టికెట్ రేట్స్ తో చూడటం చూడకపోవడం అనేది ప్రేక్షకుల ఇష్టం. సినిమా బాగుంటే.. ఈ రేటు పట్టించుకోరు ఎక్కువ మధ్యతరగతి ప్రేక్షకులు. అదే మిడిల్ క్లాస్.. వాళ్లు అయితే.. కాస్త ఆలోచించాల్సిందే.
ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్స్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా మంది థియేటర్స్ కు దూరమయ్యారు. నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో చూడొచ్చనే ధీమాతో ఉన్నారు. అలాంటి వాళ్లు ఈ పెరిగిన టికెట్ రేట్స్ తో థియేటర్స్ వైపు అడుగులు వేస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా టికెట్ రేట్స్ పెంపులో పుష్ప 2 చరిత్ర తిరగరాసింది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు కూడా ఈ రేంజ్ లో టికెట్ రేట్స్ పెంచలేదు. కానీ పుష్ప 2 మాత్రం ఆ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మల్టీప్లెక్స్ లో ఈ సినిమాను మిడిల్ క్లాస్ కుటుంబంతో కలిసి చూడాలంటే పెద్ద సాహసమే చేయాలి. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కుటుంబం చూడాలంటే 5వ తేది 8వ తేది వరకు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే రూ. 2300 దాకా అవుతోంది. ఇంటర్వెల్ లో స్నాక్స్ గట్రా తీసుకుంటే.. రూ. 3500 దాకా ఖర్చు అవుతోంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 1500 వరకు అవుతుంది.
మరోవైపు అందరి కంటే ముందు చూడాలనుకునే వీరాభిమానుల వేలంవెర్రిని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. విడులకు ఒక రోజు ముందే రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారు. బెనిఫిట్ షోలు అనేవి కొన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్స్ లో మాత్రమే ప్రదర్శించేవారు. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం అన్ని థియేటర్స్ లో ప్రత్యేక షోలకు అనుమతులు ఇచ్చేసింది గవర్నమెంట్. ఈ షోలకు ఒక్కో టికెట్ రేట్ పై రూ. 800 అదనం గా చెల్లించాలి.
సింగిల్ స్క్రీన్స్ లో ఈ మూవీ టికెట్ రేట్స్ పెంపు విషయానికొస్తే.. 5వ తేది నుంచి 8 వరకు టికెట్ రేట్ పై రూ. 150 పెంచుకోవడానిక అనుమతులు ఇచ్చారు. 9 నుంచి 16 వరకు ఒక్కో టికెట్ రేట్ పై రూ. 105 పెంచారు. ఇక 17వ తేది నుంచి 23 వరకు రూ. 20 అదనం.
మల్టీప్లెక్స్ లో మొదటి నాలుగు రోజులు.. రూ. 200 పెంచారు. 9 నుంచి 16వ తేది వరకు రూ. 150 పెంపు. 17వ తేది నుంచి 23వ తేది వరకు ఒక్కో టికెట్ పై రూ. 50 అదనం. ఈ పెరిగిన రేట్లకు GST ఎక్స్ ట్రా అని చెప్పాలి. మొత్తంగా పుష్ప 2 సినిమా రిలీజైన 19వ రోజులకు వరకు సాధారణ టికెట్ రేట్స్ ఉండవు. మాములు రేట్స్ లో చూడాలంటే డిసెంబర్ 24వ వరకు ఓపిక పట్టాల్సిందే. లేకపోతే ఓటీటీలో ఎంచక్కా ఈ సినిమాను చూడొచ్చు.