భారత్‌కు షాక్.. ఈబీ 5 వీసాలను అమెరికా రద్దు చేస్తోందా..?

భారత్‌కు మరోమారు అమెరికా షాక్ ఇచ్చింది. ఈబీ 5 ఇన్వెస్టర్ వీసాలను రద్దు చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. 

Last Updated : Jun 23, 2018, 06:13 PM IST
భారత్‌కు షాక్.. ఈబీ 5 వీసాలను అమెరికా రద్దు చేస్తోందా..?

భారత్‌కు మరోమారు అమెరికా షాక్ ఇచ్చింది. ఈబీ 5 ఇన్వెస్టర్ వీసాలను రద్దు చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులు వచ్చి మోసాలకు పాల్పడుతున్నారని భావించి అమెరికన్ ప్రభుత్వం నిబంధనలను సవరించాలని భావిస్తోంది. గతంలో ఇన్వెస్టర్లుగా వచ్చే వారు అమెరికాలో గ్రీన్ కార్డులు కూడా పొందేవారు.

ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారతీయులతో పాటు చైనా, వియత్నాంకి చెందిన ఇన్వెస్టర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టడంలో ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని.. వీసాల మంజూరులో కొంత కఠినత్వాన్ని పాటించాలని భావిస్తోంది.

దాదాపు ఒక మిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈబీ 5 వీసాలు ఇచ్చేవారు. అయితే అలా వచ్చే విదేశీయుల వల్ల స్థానిక ఇన్వెస్టర్లు ఇబ్బందిని ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయని.. ఈ క్రమంలో ఈ విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతీ సంవత్సరం దాదాపు 10,000 వరకూ ఈబీ 5 వీసాలను అమెరికన్ ప్రభుత్వం మంజూరు చేసేది. ఛండీగఢ్, ఢిల్లీ, ముంబయి ప్రాంతాల నుండి అనేకమంది ఇన్వెస్టర్లు ఇప్పటికే ఈబీ 5 వీసాలను పొంది ఉన్నారని సమాచారం. 

Trending News