Three Head Snake: సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి వైరల్(Viral Photo)గా మారింది. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. అదేంటంటే మూడు తలల పాము ఫొటో(Three Head Snake Photo). ప్రస్తుతం ఈ పిక్ సోషల్‌మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఫొటో అసలు నిజం తెలిసి..నెటిజన్స్ నోరేళ్లబెడుతున్నారు.
Attacus Atlas is one of the largest butterflies in the world and lives only for two weeks with one goal in their adult stage: lay eggs and defend them until they hatch while disguised as a snake pic.twitter.com/oc7u2H288X
— Rob N Roll 🎃™️ (@thegallowboob) October 15, 2021
అయితే ఫొటోలో మనకు పాములా కనిపిస్తోంది వాస్తవానికి ఒక కీటకం. ఇది చాలా సాధారణమైన ఒక పురుగు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ కొన్ని విషయాలు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కీటకం పేరు అటాకస్ అట్లాస్(Attacus Atlas). దీనిని అట్లాస్ మాత్ అని కూడా అంటారు. ఇది సీతాకోక చిలుక జాతి(Butterfly species)కి చెందినది. ఇది వయోజన దశలో రెండు వారాలు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే గుడ్లను కాపాడటానికి పాముల రూపంలో కనిపిస్తూ రక్షించడం వాటి పని.
Also Read: Viral Video: ఉమ్మితో రోటీ తయారు చేశాడు...జైలుపాలయ్యాడు!
మాంసాహార జీవులను భయపెట్టడానికి ఇలా పాము తలలా కనిపిస్తుంది. ఈ కీటకాలు(Insects) ఎక్కువ భాగం ఆసియాలో మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయిన వెంటనే ప్రజలు దానిపై విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఇది కీటకమంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి