Naga Chaitanya Sobhita Dating: నాగ చైతన్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ టైం దక్షా నగార్కర్‌తో కన్ను కొట్టే వీడియో, సిగ్గు పడుతూ కనిపించిన వీడియోతో వైరల్ అయ్యాడు నాగ చైతన్య. ఇక శోభితతో నాగ చైతన్య డేటింగ్ రూమర్లు అయితే ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే అవుతుంటాయి. నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్ల మీద సమంత కూడా పరోక్షంగా స్పందిస్తూనే ఉంటుంది.
నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్లు వస్తే.. అవి సమంత పీఆర్ టీం చేస్తోందంటూ.. అక్కినేని అభిమానులు ఆ మధ్య మండి పడ్డారు. అయితే ఇలాంటి రూమర్లు హీరో మీద వస్తే.. పీఆర్ టీం చేసిందని అంటాను.. అదే హీరోయిన్ మీద వస్తే మాత్రం నిజమని నమ్ముతారా..? అని సమంత నిలదీసింది. అలా సమంత అప్పుడు వేసిన ట్వీట్ వైరల్ అయింది.
తాజాగా సమంత మరోసారి చై శోభిత డేటింగ్ రూమర్ల మీద స్పందించినట్టు అయింది. ఎవరు ఎవరితో డేటింగ్ చేసినా తనకు ప్రాబ్లం లేదంటూ సమంత స్పందించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అవే వార్తలను తెలుగు మీడియా రాస్తే మాత్రం.. తాను అలా ఎప్పుడూ అనలేదంటూ చెప్పేసింది. దీంతో పరోక్షంగా చైతూ, శోభిత డేటింగ్‌ల మీద స్పందించినట్టు అయింది.
Also Read: Dasara OTT Release Date : నాని దసరా మూవీ.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే
తాజాగా అఖిల్ తన కొత్త సినిమా ఏజెంట్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సారి మీడియా ముందుకు వచ్చాడు. ఈ సమయంలో అఖిల్‌కు తన అన్న నాగ చైతన్యకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ అన్న ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.. ఎవరో అమ్మాయితో కలిసి తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.. మరి నీ సంగతి ఏంటి..? అని ఓ మీడియా ప్రతినిధి అడిగాడు. దీనికి అఖిల్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. రెండేళ్లుగా ఏజెంట్‌తోనే సరిపోయింది.. ఈ జుట్టూ, ఈ బాడీ మెయింటైన్ చేయడమే సరిపోయిందని అన్నాడు. తన ఫోకస్ అంతా కూడా సినిమా మీదే ఉందని పరోక్షంగా చెప్పాడు. అన్నలా ఇతర విషయాల మీద ఫోకస్ పెట్టలేదని అనేసినట్టుగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Naga Chaitanya Sobhita Dating: చై శోభిత డేటింగ్.. అంత మాట అనేసిన అఖిల్ అక్కినేని