Kavitha Clarity on Sukesh Chandrasekhar Latters: తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపైనా.. తనపైనా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో కవిత స్పందించి ఓ ప్రకటన లేఖ విడుదల చేశారు.
ఒక ఆర్థిక నేరగాడు విడుదల చేసిన అనామక లేఖను రిలీజ్ చేయడం.. ఆ తరువాత వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చూస్తుంటే.. పనిగట్టుకుని బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు.
'అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకొని తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడెను కట్టేయమన్న చందంగా.. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం..' అని కవిత అన్నారు.
Also Read: Loan Costly: ఈ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం
రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే.. ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలంగాణ సమాజం గ్రహించాలని కోరారు. అందరూ జాగ్రత్త పడాలని సూచించారు. సీఎం కేసీఆర్‌పై కక్షతో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్ష్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుందన్నారు. తనపై బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు దమ్ము.. నిజాయితీ ఉంటే తన వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! అంటూ స్పష్టం చేశారు.
Also Read: PPF Vs EPF: మీరు రిటైర్మెంట్కు ప్లాన్ చేస్తున్నారా..? వడ్డీ ఎక్కువ వచ్చే పథకాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.