USA Visa Cost Increased: అమెరికాకు టూరిస్ట్ వీసాపై కానీ లేదా స్టూడెంట్ వీసాపై కానీ వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటున్న వారికి అమెరికా సర్కారు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మే నెల 30 వ తేదీ నుంచి అమెరికా వెళ్లే వారు వీసాల కోసం ఇంకొంత అధిక మొత్తంలో కాన్సులర్ ఫీజు చెల్లించుకోక తప్పదు. ఈ మేరకు అమెరికా సర్కారు నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వీసా మంజూరు కోసం వసూలు చేసే చార్జిలను సవరించిన అమెరికా ప్రభుత్వం.. కాన్సులర్ ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే 30వ తేదీ నుంచి వీసాల ఫీ పెంపు వర్తిస్తుంది.
ఇప్పటివరకు 165 అమెరికన్ డాలర్లుగా ఉన్న వీసా కాన్సులర్ చార్జీలు ఇకపై 185 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికన్ సర్కారు స్పష్టంచేసింది. ఇది కేవలం టూరిస్ట్ వీసా, స్టూడెంట్స్ వీసాలకే కాకుండా బిజినెస్ వీసాలకు కూడా వర్తిస్తుంది అని జో బిడెన్ సర్కారు తేల్చిచెప్పింది.
అదే సమయంలో తాత్కాలిక ఉద్యోగ పనుల కోసం దరఖాస్తు చేసుకునే నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల చార్జీలు 190 అమెరికన్ డాలర్లు నుంచి 205 డాలర్లకు పెరగనున్నాయి. తాత్కాలిక బిజినెస్ అవసరాల కోసం అమెరికాలోకి ప్రవేశించే విజిటార్ వీసాలు B-1 వీసా, B-2 వీసా కేటగిరీలుగా ఉంటాయి.
ఇది కూడా చదవండి : Single Lion Vs Group of Hyena's: హైనాల ఆకలికి అంతుండదు.. ఒంటరిగా చిక్కిన సింహాన్ని ఎలా వెంటపడి తింటున్నాయో చూడండి!
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాకు వచ్చే విజిటర్స్ పై అనేక ఆంక్షలు విధించిన అమెరికా సర్కారు ఆ తరువాత ఆ ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత అమెరికాను సందర్శించే విదేశీయుల్లో భారతీయుల సంఖ్యే అధికంగా ఉంది. అంతేకాకుండా అమెరికా వెళ్లే వారి యూఎస్ విజిటర్ వీసా ఇంటర్వ్యూల సమయాన్ని కూడా 60 శాతం తగ్గించినట్టు యూఎస్ సర్కారు స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : Headless Snake Video: వారెవ్వా.. తల తెగి పడిన.. వ్యక్తిపై దాడి చేస్తున్న పాము.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్న జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK