Grah yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒకే రాశిలో గ్రహాల కలయికను మైత్రి అంటారు. గ్రహ సంయోగం మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది. మేషరాశిలో బుధుడు, సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతుంది. బుధుడు తెలివితేటలకు, సూర్యుడు ఆత్మకు, అదృష్టానికి బృహస్పతిని కారకుడిగా భావిస్తారు. వేద జ్యోతిషశాస్త్రంలో ఈ మూడు గ్రహాలూ చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. కొన్ని రాశుల వారు ఈ మూడు గ్రహాల యొక్క మహాయుతి కారణంగా 5 రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి- ఈ మూడు గ్రహాల మైత్రి వల్ల సింహరాశి వారు ప్రయోజనం పొందనున్నారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
మిథునరాశి- సూర్య, బుధు మరియు బృహస్పతి కలయిక వల్ల మిథునరాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. అంతేకాకుండా మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. దాంపద్య జీవితం మునుపటి కంటే సంతోషంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు.
కర్కాటకం- కర్కాటక రాశి వారికి కూడా ఈ గ్రహ సంయోగం వల్ల చాలా మేలు జరుగుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగం చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న ఫలితాలను పొందతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
మీనం- ఈ మూడు గ్రహాల కలయిక మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. దీని కారణంగా మీలో ధైర్యం, పరాక్రమం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆఫీసులోమీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
Also Read: Solar Eclipse 2023: సూర్యగ్రహణం ఈ 3 రాశులకు దెబ్బ.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook