తాతకు తీరని కోరికను తీర్చనున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ?

స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో ఎన్టీఆర్ ?

Last Updated : Jul 30, 2018, 04:23 PM IST
తాతకు తీరని కోరికను తీర్చనున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ?

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు నటుడిగా ఎన్నో రకాల పాత్రలు చేసి ఆడియెన్స్‌ని మెప్పించినప్పటికీ... నటుడిగా ఆయనకు మాత్రం ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండిపోయిందట. అదే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషించడం. అవును, అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించాలని కోరుకున్న ఎన్టీఆర్ అందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ అవకాశం నటుడు సూపర్ స్టార్ కృష్ణ తలుపు తట్టిందట. కృష్ణను అల్లూరి సీతారామ రాజు పాత్రలో చూసిన తర్వాత ఇక తాను ఆ పాత్ర చేయాలనే కోరికను వదిలేసుకున్నాడట ఎన్టీఆర్. అలా ఆనాడు సీనియర్ ఎన్టీఆర్‌కు తీరని కోరికను ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీర్చుకోనున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. 

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్న సినిమాలో ఆయన అల్లూరి సీతారామ రాజు పాత్రను చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎవ్వరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

అక్టోబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో తారక్‌తోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 

Trending News