Dhamki Day 1 Collections Record: మాస్కా దాసుగా చెప్పుకుంటున్న విశ్వక్సేన్ తాజా చిత్రం ధమ్కీ, దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు విశ్వక్సేన్. ఈ సినిమాకి ముందుగా ఒక దర్శకుడుని అనౌన్స్ చేసి తర్వాత ఆయన్ని తప్పించి తానే దర్శకత్వం వహించడం ఆసక్తికరంగా మారింది. సినిమాకు -దర్శకుడికి కనెక్టివిటీ లేదని భావించిన విశ్వక్సేన్ స్వయంగా తానే దర్శకుడిగా మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఈ సినిమా మొట్టమొదటి రోజు వసూళ్ల విషయంలో దుమ్మురేపింది.
ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మరో సినిమా రంగమార్తాండని డామినేట్ చేస్తూ కలెక్షన్స్ విషయంలో దూసుకు పోయింది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని విశ్వక్సేన్ స్వయంగా సొంత బ్యానర్ల మీద నిర్మించాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో 91 లక్షలు సీడెడ్ ప్రాంతంలో యాభై మూడు లక్షలు, ఉత్తరాంధ్ర నలభై లక్షలు, ఈస్ట్ గోదావరి 30 లక్షలు, వెస్ట్ గోదావరి 20 లక్షలు, గుంటూరు 40 లక్షలు, కృష్ణా జిల్లా 25 లక్షలు, నెల్లూరు జిల్లా 17 లక్షలు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల ఆరు లక్షల షేర్, 5 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేయగా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 40 లక్షలు ఓవర్సీస్ లో 62 లక్షలు వెరసి నాలుగు కోట్ల ఎనిమిది లక్షల షేర్ 8 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 7 కోట్ల 50 లక్షల జరిగింది. ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఎనిమిది కోట్లు నిర్ణయించారు. ఇంకా మూడు కోట్ల 92 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ని ఒక్క రోజులోనే దాటేసింది. అదేవిధంగా నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా వసుళ్ళ విషయంలో కూడా దాదాపు దగ్గర దగ్గరగా ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ఒక్కరోజులోనే దగ్గరయింది.
ఇలా చూసుకుంటూ పోతే సినిమా హీరో బ్యాక్ గ్రౌండ్ కానీ ఆయన గత సినిమాల హిట్లతో గాని ప్రేక్షకులు ఏమాత్రం బేరీజు వేసుకోవడం లేదు. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనే ఒక్క విషయాన్ని మాత్రమే కాల్కులేట్ చేసుకుంటున్నారని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక విశ్వక్సేన్ గత సినిమాలు కూడా కొన్ని దారుణమైన డిజాస్టర్లుగా నిలిచాయి కానీ ఈ సినిమా ఆయనకు మంచి కిక్కిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook