Swapnalok Complex Fire Accident Death Toll: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గురువారం రాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఘటనలో చివరకు తీవ్ర విషాదమే మిగిలింది. తొలుత 7, 8వ అంతస్తుల్లోంచి పొగ రావడం గమనించిన పబ్లిక్.. లోపలి వారిని అప్రమత్తం చేసేలోపలే ఆ రెండు అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. అలా మొదలైన మంటలు క్రమక్రమంగా బిల్డింగ్ లోని మిగతా అంతస్తులకు సైతం వ్యాపించాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన పైర్ ఇంజన్స్‌తో అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మొత్తం డజన్‌కి పైగా ఫైర్ ఇంజన్స్‌ని ఉపయోగిస్తున్నారు.
ఎత్తయిన క్రేన్స్ సహాయంతో పై అంతస్తుల్లో చిక్కుకున్న 8 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రెస్క్యూ చేసినప్పటికీ.. ఇంకా మరో ఏడుగురు బిల్డింగ్ లోపలే చిక్కుకున్నారు. 5వ అంతస్తులో చిక్కకున్న వీళ్లను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది శతవిధాలా ప్రయత్నించారు. బిల్డింగ్‌లో చిక్కుకున్న వారిని శివ, ప్రమీల, వెన్నెల శ్రావణి, త్రివేణిగా గుర్తించారు. చీకట్లో సెల్ ఫోన్ లైట్ వేస్తూ, బిగ్గరగా అరుస్తూ తమను కాపాడాల్సిందిగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు ఆర్తనాదాలు పెట్టారు. అయితే బిల్డింగ్ పాతది కావడం, ఫైర్ ఎక్సిట్ లేకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సైతం వారిని చేరుకోవడం కష్టంగా మారింది. అతికష్టం మీద పై అంతస్తుల్లోకి చేరుకుని అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రమీల, ప్రశాంత్, వెన్నెల, శ్రావణి, త్రివేణి మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.
Telangana | Huge fire broke out in Swapnalok Complex in Secundrabad, fire engine rushed to the spot.
Around 7:30pm a fire broke out due to a short circuit, we are trying to rescue people who are stuck inside, and so far we don't know how many are stuck. Fire engines have rushed… https://t.co/EXKpCpvKbf pic.twitter.com/x5Uv0qNgWN
— ANI (@ANI) March 16, 2023
మంటలను అదుపులోకి తీసుకొస్తూనే, బాధితులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన్నట్టు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల బిల్డింగ్స్ లో ఉన్న వారిని ఖాళీ చేయించిన పోలీసులు.. అక్కడ గుమిగూడిన వారిని దూరంగా వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. బిల్డింగ్ పాతది కావడంతో పాటు మంటల్లో తగలబడుతుండటంతో మరేదైనా ఊహించని ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తూ అక్కడ గుమిగూడిన వారిని పోలీసులు దూరంగా పంపిస్తున్నారు. ఇదిలావుంటే, జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ రెండు వేర్వేరు అగ్ని ప్రమాదం ఘటనలకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KTR: మేము తెలంగాణ ఇయ్యకుంటే మీరు బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేదన్న రేవంత్ రెడ్డి
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైడ్రామా.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
ఇది కూడా చదవండి : TSPSC Paper Leak: పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే.. బర్తరఫ్ చేసి లోపలేసి తొక్కే దమ్ముందా..? బండి సంజయ్ సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK