Body Detox: శరీరానికి డీటాక్స్ ఎందుకు అవసరం, ఎప్పుడెప్పుడు చేయాలి, లక్షణాలేంటి

Body Detox: మనిషికి క్లీనింగ్ అనేది బాహ్యంగానే కాదు..అంతర్గతంగా కూడా చాలా అవసరం. అంతర్గతంగా క్లీన్ అయితేనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. శరీరాన్ని అంతర్గతంగా క్లీన్ చేయడాన్నే డీటాక్స్ అంటారు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2023, 06:03 PM IST
Body Detox: శరీరానికి డీటాక్స్ ఎందుకు అవసరం, ఎప్పుడెప్పుడు చేయాలి, లక్షణాలేంటి

Body Detox: మనిషి శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను ఎప్పటికప్పుడు డీటాక్స్ ప్రక్రియ ద్వారా తొలగించుకోవాలి. అప్పుడే వివిధ రకాల వ్యాధుల్నించి సంరక్షణ ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ డీటాక్స్ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలో తెలుసుకుందాం..

శరీరానికి బాహ్య శుభ్రత ఎంత ముఖ్యమో..అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం. శరీరం అంతర్గత శుభ్రత లేదా వ్యర్ధ పదార్ధాలపైనే ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా ఆధారపడి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. 

నిత్యం తినే వివిధ రకాల ఆహార పదార్ధాలు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణం కాని ఆహారమంతా వ్యర్ధాలుగా శరీరంలోనే ఉండిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఈ వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్, కావల్సినంత నీరు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయేందుకు దోహదమౌతాయి. 

శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు మీ శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. ఆ సంకేతాలేంటి, ఎప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలనేది తెలుసుకుందాం..

నోటి దుర్వాసన

మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా మీ శరీరంలో విషపదార్ధాలు పేరుకున్నాయని అర్ధం. మీ శరీరంలో చాలా రకాల విష పదార్ధాలు పేరుకుపోతుంటాయి. దాంతో ఎక్కువ చెమట పట్టడమే కాకుండా మీ శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది. ఈ సమస్యలు  ఎదురైనప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాల్సి వస్తుంది.

మల బద్ధకం, కడుపు ఉబ్బరం

అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బడం వంటి సమస్యలు శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే ప్రేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విష పదార్ధాలు మీ జీర్ణశక్తిని పాడుచేసి..కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే శరీరాన్ని డీటాక్స్ చేయాల్సి ఉంటుంది.

విసుగు, నిరాసక్తత

ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడ్ పాడవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే..మెటబోలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి. 

చర్మ సంబంధిత సమస్యలు కూడా శరీరంలో వ్యర్ధాలకు కారణంగా ఉంటాయి. మీ రక్తాన్ని అశుద్ధం చేస్తాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. ఇవికాకుండా హార్మోన్ అసమతుల్యత, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటే..శరీరాన్ని డీటాక్స్ చేయాలి.

Also read: Juice Habit: రోజూ జ్యూస్ తాగితే ఏమౌతుంది, శరీరానికి మంచిదా కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News