శని స్థితి మార్పు ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా పడనుంది. శని గ్రహం ఇటీవలే తన రాశి కుంభంలో ఉదయించడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రగతి, డబ్బులు లాభించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కర్మ అనుసారంగా ఫలితాలనిచ్చే న్యాయ దేవతగా భావిస్తారు. మార్చ్ 6 సోమవారం శని కుంభరాశిలో ఉదయించాడు. శని తన మూల త్రికోణ రాశి కుంభంలో ఉదయించడం 30 ఏళ్ల తరువాత జరిగింది. ఈ క్రమంలో శని అస్తమించడం వల్ల కొన్ని రాశుల జీవితంలో కష్టాలు ఎదురుకావచ్చు. అయితే ఇప్పుడు శని ఉదయంచడం వల్ల 5 రాశులవారికి చాలా లాభం కలగనుంది. ఎందుకంటే కుంభరాశిలో ఇప్పటికే సూర్య, బుధ గ్రహాలున్నాయి. ఫలితంగా ఏర్పడే యుతి శుభ సూచకం కానుంది. శని ఉదయించడం ఏయే రాశులకు అదృష్టమో తెలుసుకుందాం..
శని ఉదయించడం వల్ల ఈ రాశులకు లాభం
వృషభ రాశి
శని ఉదయించడం ప్రభావం వృషభ రాశివారికి అద్భుతమైన లాభాన్నిస్తుంది. ఊహించని ఆర్ధిక లాభాలు కలుగజేస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన సమయం. ఆకస్మిక ధనలాభం కలగడమే కాకుండా గుడ్‌న్యూస్ వింటారు.
కర్కాటక రాశి
శని తన రాశిలోనే ఉదయించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనం కలగనుంది. పనులు పూర్తవడం, వృత్తి జీవితంలో కీలక విజయం సాధించడం ఉంటుంది. మీ పనులపై ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయం అంతా సానుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ఇతర సమస్యలు తలెత్తవు.
సింహ రాశి
శని ఉదయించడం వల్ల సింహ రాశి జాతకులకు ఊహించని అనుకోని డబ్బు లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కన్పిస్తాయి. వ్యాపారాలకు అనువైన సమయం. భారీగా లాభాలుంటాయి. ఈ రాశి జాతకులకు అంతా బాగుంటుంది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు శని ఉదయించడం వల్ల ఉద్యోగ , వ్యాపారాల్లో చాలా ప్రయోజనం కలగనుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కలుస్తారు. ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితంలో అద్భుతమైన అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతారు.
ధనస్సు రాశి
శని ఉదయించడం వల్ల ధనస్సు రాశి ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలుంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలుంటాయి. ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి. కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. పెళ్లి జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also read: Sun Transit 2023: సూర్య గోచారం ప్రభావం, ఈ రాశివారికి మార్చ్ 15 నుంచి కష్టాలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook