Navpancham Yog 2023: మిథునరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్న కుజుడు.. రాబోయే 2 నెలలుపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

Navpancham Yog 2023: ధైర్యానికి, వివాహానికి, భూమికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. ఇతడు మార్చి 13న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుజుడు 69 రోజులు మిథునరాశిలో ఉండి నవపంచమ యోగాన్ని సృష్టిస్తాడు. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 04:00 PM IST
Navpancham Yog 2023: మిథునరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్న కుజుడు.. రాబోయే 2 నెలలుపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

Navpancham Yog 2023 in Mithun Rashi: గ్రహాల కమాండర్ అయిన అంగారకుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. మరో వారం రోజుల్లో అంటే మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడే 69 రోజులపాటు మార్స్ ఉండనున్నాడు.  కుజుడు మిథునరాశిలో సంచరించడం వల్ల నవపంచమ యోగం ఏర్పడుతుంది. అంగారకుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

అంగారక సంచారం ఈ రాశులకు వరం
మేషం: కుజుడు సంచారం మేషరాశిపై శుభ ప్రభావం చూపుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. కెరీర్‌లో అపారమైన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మిథునం : కుజుడు మిథునరాశి ప్రవేశం ఈ రాశివారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా రాబడి ఉంటుంది. పార్టనర్‌షిప్‌తో పనిచేసవారు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
సింహ రాశి : సింహ రాశి వారి ఆర్థికంగా బలపడతారు. మీరు పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం దక్కుతుంది. 

కన్య: అంగారక సంచారం వల్ల కన్యా రాశి వారికి ప్రమోషన్ లభిస్తుంది. బాస్ నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు ఏదైనా అవార్డు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
మకరం: కుజుడు సంచారం మకర రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కెరీర్‌కు మంచి సమయం. ధనలాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Solar Eclipse 2023: ఏప్రిల్ ఏర్పడబోయే సూర్యగ్రహణం వల్ల వీరు చాలా నష్టపోతారు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News