మార్చ్ నెలలో మంగళ, బుధ, శుక్ర, సూర్య గ్రహాలు రాశి మారనున్నాయి. ఫలితంగా ఈ నెల చాలా ప్రత్యేకం కానుంది. జ్యోతిష్యం ప్రకారం అత్యంత మహత్యం కలిగిందిగా ఉంటుంది. గురు గ్రహం ఆస్తమించడం, శని ఉదయించడం ఇదే నెలలో జరగనుంది. ఫలితంగా 4 రాశులపై ఊహించని శుభ పరిణామాలుంటాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక కారణంగా మార్చ్ నెల అత్యంత మహత్యమైంది. ఈ నెలలోనే మంగళ, బుధ, శుక్ర, సూర్య గ్రహాలు రాశి మారనున్నాయి. అదే సమయంలో గురు గ్రహం అస్తమిస్తుంటే..శని ఉదయించనున్నాడు. ఈ ప్రభావంతో వృషభ, మిధున, కన్యా, ధనస్సు రాశుల జాతకమే మారిపోనుంది. లక్కీ రాశులు కానున్నాయి. ఊహించని లాభాలు ఆర్జిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశివారికి మార్చ్ నెల అత్యంత కీలకం. ప్రత్యేకించి మార్చ్ 15వ తేదీ తరువాత చాలా శుభసూచకంగా ఉంటుంది. కెరీర్‌పరంగా విజయం లభిస్తుంది. దాంతోపాటు ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లైనవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. భాగస్వామితో అనువైన సమయం గడుపుతారు. ధనలాభం కలగడం వల్ల ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు ఉండవు.
మిధున రాశి
మిధునరాశి వారికి మార్చ్ మూడవ వారం నుంచి పూర్తిగా మారిపోనుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో మంచి సంబంధాలుంటాయి. కుటుంబ సమస్యల్ని పదవ పాదంలో ఉన్న గురుడు తగ్గిస్తాడు. శుభఫలాలు అందిస్తాడు. ఇచ్చిన రుణాలు వెనక్కి వచ్చేస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు లభిస్తాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి ప్రయాణాలు లాభాల్ని ఇస్తాయి. దాంతోపాటు ఉద్యోగంలో మంచి అవకాశాలు కలుగుతాయి. కెరీర్‌పరంగా కూడా ఈ నెల చాలా మంచిది. ఈ రాశి జాతకులకు చదువు, ఉద్యోగం రెండింట్లో చాలా బాగుంటుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులు వ్యాపారం, చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో ఎక్కువ సమయం హాయిగా గడుపుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి ఉన్నతి లభిస్తుంది. దైనందిన జీవితం కూడా బాగుంటుంది.
Also read: Rangbhari ekadashi 2023: రేపే రంగభరీ ఏకాదశి.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook