బరువు తగ్గడమనేది ఆధునిక జీవనశైలిలో ఓ సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య వెంటాడుతోంది. ఫలితంగా చాలామందికి కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దాంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
కరివేపాకుతో అధిక బరువుకు చెక్
కరివేపాకు మంచి సువాసన కలిగిన పదార్ధం. దక్షిణాదిన చాలా వంటల్లో కరివేపాకును విరివిగా ఉపయోగిస్తారు. రుచిని పెంచేందుకు కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో కరివేపాకుతో శరీరంలోని చాలా సమస్యలు దూరమౌతాయి. ఇందులో ముఖ్యమైంది స్థూలకాయం.
కరివేపాకులో ఉండే పోషకాలు
కరివేపాకులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి వంటి చాలా న్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి లాభాన్ని చేకూర్చుతాయి. ముఖ్యంగా కరివేపాకును బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పరిగణించవచ్చు. అందుకే కరివేపాకు వినియోగంతో కేశాలు, చర్మ సంరక్షణ అవుతుంది. ఏజీయింగ్ సమస్యకు చెక్ పెడుతుంది.
కొవ్వు కరిగించడంలో కీలకం
పొట్ట, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలంటే..కరివేపాకు జ్యూస్ తీసుకోవాలి. ఇందులో ఉండే ఆల్కలాయిడ్ల సహాయంతో లిపిడ్, ఫ్యాట్ కరిగించవచ్చు. కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గించవచ్చు. దాంతోపాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.
కరివేపాకుతో జ్యూస్ ఎలా
కరివేపాకు జ్యూస్ తయారు చేసేందుకు ముందుగా కరివేపాకుల్ని కడిగి నీళ్లలో ఉడికించాలి. కొద్దిసేపటి తరువాత ఈ నీళ్లను వడకాచి..గోరువెచ్చగా తాగాలి. రుచి కోసం అవసరమైతే నిమ్మ రసం, తేనె కొద్దిగా కలుపుకోవచ్చు. అయితే పరగడుపున మాత్రమే కరివేపాకు జ్యూస్ తాగాలి.
Also read: Vegetables Storage Tips: ఆ 4 కూరగాయల్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదా, ఉంచితే ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook