Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!

Chandrababu can Be Blamed: నందమూరి తారకరత్న మరణం విషయంలో విజయసాయి రెడ్డి లేకుంటే వైసీపీ ప్రాపగాండా మరోలా ఉండేదని, ఒక రేంజ్ లో దారుణంగా విమర్శలు వచ్చేవని అంటున్నారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 20, 2023, 09:13 AM IST
Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!

If Vijay Sai Reddy Not There Chandrababu can Be Blamed: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై తర్వాత చికిత్స పొందుతూ 23 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం మీద అనేక రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజునే కన్నుమూశారని, అయితే నారా లోకేష్ మీద చంద్రబాబు మీద దరిద్రులు అనే మరక పడకూడదని ఇన్ని రోజులు ఆయన చనిపోయినా సరే బతికి ఉన్నట్టు నమ్మిస్తూ కుటుంబాన్ని మోసం చేశారంటూ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేసింది.

వాస్తవానికి ఈ ఆరోపణలను వైసీపీ సోషల్ మీడియా చాలా రోజులుగా చేస్తూనే వస్తోంది.  అయితే చంద్రబాబు లోకేష్ అలాగే టిడిపి వారికి ఊరట ఇచ్చే విధంగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తారకరత్న హాస్పిటల్ లో ఉండగా వెళ్లి పరామర్శించడమే కాక ఆయనకు మెరుగైన వైద్యం అందుతుందని తాను డాక్టర్లతో మాట్లాడానని మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు, బాలకృష్ణకు థాంక్స్ అని చెప్పారు. అప్పుడు మాత్రమే కాదు నిన్న తారకరత్న పార్థివ దేహం హైదరాబాదులోని ఆయన మోకిల నివాసానికి వచ్చిన సమయంలో కూడా విజయసాయిరెడ్డి అంతా తానే అయి వ్యవహరించారు.

తారకరత్న కుటుంబం వైపు నుంచి బాలకృష్ణ అన్నీ తానే అయి చూసుకుంటుంటే అఖిలారెడ్డి తరఫునుంచి విజయసాయిరెడ్డి అన్ని తానే అయి నిలబడ్డారు. ఒక రకంగా నిన్న కూడా మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అండగా ఉంటామని సొంత కుటుంబ సభ్యులలా చూసుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. ఒకరకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఈ సీన్లో లేకపోతే చంద్రబాబు అండ్ లోకేష్ ఈ విషయంలో కూడా విమర్శలకు గురి కావాల్సి వచ్చేది.

ఇప్పటికే చంద్రబాబు మీద వెన్నుపోటు అనే ఒక ముద్ర ఉంది. అప్పట్లో జరిగిన పరిణామాలను చంద్రబాబు వ్యతిరేకవర్గం వెన్నుపోటు అనే ప్రచారం చేస్తే ఆయన అనుకూల వర్గం మాత్రం బాధ్యత అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరిగిన సంఘటనలో విజయసాయిరెడ్డి కనక లేకుంటే ఈ ప్రాపగాండా మరో లెవల్ లో ఉండేదని, కావాలని చంద్రబాబు అండ్ కో తారకరత్న ఎప్పుడో చనిపోయినా ఇప్పటివరకు దాచి పెట్టారని ఇంకా పెద్ద ఎత్తున ప్రాపగాండా జరిగి ఉండేదని అంటున్నారు.

ఇక ఈ సీన్లో విజయసాయిరెడ్డి ఉండడంతో వైసీపీ సోషల్ మీడియా మీడియా కూడా కాస్త సైలెంట్ అయిందని అంటున్నారు. లక్ష్మీపార్వతి లాంటి నారా, నందమూరి కుటుంబం అంటే పడని వారు ఏవో మాట్లాడుతున్నారు తప్ప వైసీపీలో ఉన్న కీలక నేతలు ఎవరూ ఈ విషయం మీద మాట్లాడడం లేదు అంటే అది విజయసాయిరెడ్డి మీద ఉన్న గౌరవంతో పాటు తమ వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఆరోపణలు చేసినా వాటికి విలువ ఉండదనే వారు సైలెంట్ అయ్యారని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి కనక లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Taraka Ratna Biography: ప్రపంచంలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?

Also Read:Taraka Ratna Children: తారకరత్నకు కుమార్తె మాత్రమే కాదు.. ఒక వారసుడు కూడా ఉన్నాడు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News