IND vs AUS 3rd Test: భార‌త్, ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్పు.. వైజాగ్‌లో మూడో టెస్ట్!

Vizag Likely to host India vs Australia 3rd Test. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2023లో భాగంగా జరిగే మూడో టెస్టు వేదిక మార‌నుంది. వైజాగ్‌ మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 07:32 PM IST
  • భార‌త్, ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్పు
  • వైజాగ్‌లో మూడో టెస్ట్ మ్యాచ్
  • మార్చి 1 నుంచి ధ‌ర్మ‌శాల వేదిక‌గా మూడో టెస్టు
IND vs AUS 3rd Test: భార‌త్, ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్పు.. వైజాగ్‌లో మూడో టెస్ట్!

Dharamsala will not be hosting India vs Australia 3rd Test: బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2023లో భాగంగా జరిగే మూడో టెస్టు వేదిక మార‌నుంది. అంత‌ర్జాతీయ మ్యాచ్ నిర్వ‌హించేందుకు ధ‌ర్మ‌శాల స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో మ్యాచ్ వేదికలో మార్పు చేయక బీసీసీఐకి తప్పడం లేదు. దాంతో మ‌రో వేదికలో మూడో టెస్టు జ‌ర‌గ‌నుంది. ఇండోర్ లేదా రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ నిర్వ‌హించేందుకు బీసీసీఐ స‌న్నాహాలు చేస్తోంది. వైజాగ్‌ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

షెడ్యూల్ ప్ర‌కారం 2023 మార్చి 1 నుంచి 5 వరకు ధ‌ర్మ‌శాల వేదిక‌గా మూడో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ మ‌ధ్యే ధ‌ర్మ‌శాల గ్రౌండ్‌కు మ‌ర‌మ్మ‌తులు చేశారు. ఇక్కడ నూతన అవుట్ ఫీల్డ్, డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. 2023 ఆరంభంలోనే ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ధర్మశాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పనులు ఆలస్యమయ్యాయి. దాంతో మ్యాచ్ సమయానికి మైదానం సిద్దమవుతుందో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి. మూడో టెస్టు వేదిక మారడంపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

'పిచ్ పక్కన ప్రాంతంలో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. మూడో టెస్టుకు ముందే ఈ పనులు పూర్తవుతాయని మేము ఆశిస్తున్నాము. బీసీసీఐ విచారణ తర్వాత మాత్రమే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. మేము సరైన డ్రైనేజీని నిర్మించాం. కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మూడో టెస్టుకు ఇంకా మూడు వారాలు మిగిలి ఉన్నందున పని పూర్తవుతుందని మేము భావిస్తున్నాము' అని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

మొహాలీతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, పుణె, బెంగళూరు వంటి నగరాలు మూడో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగణించబడుతున్నాయి. మొహాలీ లేదా విశాఖపట్నంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార‌త్‌లోని ఎత్తైన స్టేడియంగా ధ‌ర్మశాల‌ గుర్తంపు తెచ్చుకుంది. ఈ మైదానంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక టెస్టు జ‌రిగింది. 2017లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భార‌త్ ఓడించింది. ఇక ధ‌ర్మశాల‌ స్టేడియంలో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ 2022 ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక మధ్య జరిగింది. 

Also Read: IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి.. రంగంలోకి కొత్త స్పిన్నర్‌! డేవిడ్ వార్నర్‌పై వేటు  

Also Read: IIND vs PAK: భార‌త్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News