Pawan Kalyan:తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నేడు తిరుమలకు చేరుకుంటారు. రెండ్రోజులపాటు అక్కడే బస చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డూ కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న దీక్ష విరమిస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డూ కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ .. గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు,హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని తూర్పార పట్టడంలో హిందూత్వ పార్టీ అయిన బీజేపీ కంటూ జనసేనానే కాస్త దూకుడుగా వ్యవహరించారని రాజకీయా వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ప్రతిపక్ష వైసీపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఓ వారం రోజులు పాటు చేస్తే ఈ సినిమా మొదటి పార్ట్ కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి చివరి వారంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే యేడాదే థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Pawan Kalyan: నేడు తిరుమలకు పవన్ కళ్యాణ్.. దీక్ష విరమణ..