High court hot comments on hydra ranganath: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల ఘటనలు పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో.. అమీన్ పూర్ లో.. ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న కూడా కూల్చివేశారంటూ ఇంటి యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్ గా కానీ హజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో.. తెలంగాణలో నిన్న హైడ్రా కూల్చివేతలపై వాడీ వేడీగా వాదనలు నడిచాయి. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది.
రేవంత్ రెడ్డి స్వంత ప్రయోజనాలకోసం
నిజాయితీ గల ఆఫీసర్ గా పేరున్న రంగనాథ్ ని ఫణంగా పెట్టడం 😔😔
జడ్జి గారు అడిగిన ఏ ప్రశ్న కి సమాధానం లేదు pic.twitter.com/7DLyv8UGp1— Sujatha Goud (@SujathaGoud6) September 30, 2024
మెయిన్ గా శని, ఆదివారాలలో కూల్చివేతలేంటనీ ప్రశ్నించింది. అంతే కాకుండా..హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు కురిపించింది. ఓవర్ నైట్ లో హైదరబాద్ను మార్చాలని అనుకుంటున్నారా.. అని ఘాటుగా స్పందించింది. అంతే కాకుండా.. అసలు ఎఫ్టీఎల్ పరిధి ఏంటో తెల్చకుండా కూల్చివేతలేంటని కూడా ఘాటుగా స్పందించింది. రాజకీయ నాయకుల్ని సాటిస్ఫై చేసేందుకు.. మీరు చర్యలు చేయోద్దని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అసలు నల్లకుంట, బతుకమ్మ కుంటల పరిస్థితి ఏంటని కూడా ఘాటుగా స్పందించింది.
అంతే కాకుండా.. దీనిపై హైకోర్ట్ జడ్జీ మాట్లాడుతూ... తాను 1983 లో హైదరబాద్ కు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం వెళ్తున్నాన్నారు. ఒక్కసారిగా కూడా అక్కడ నీళ్లు వరదలు చూడలేదన్నారు. హైడ్రా టార్గెట్ కేవలం.. కూల్చివేతల మీదనే ఉందని ఘాటుగా స్పందించారు. ఎమ్మార్వో అడిగితే.. మెసిన్, మనుషుల్ని ఇచ్చామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైకోర్టును, చార్మినార్ ను కూల్చేయమంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్ పై మండిపడింది.
ప్రజలకి అన్యాయం జరగకుండా కాపాడే న్యాయస్థానం
ఈ వ్యవహారంలో ..
ఒక దేవుడిలా కనిపించింది బాధితులకు 🙏ఇంకా చెప్పాలంటే
ఇదెక్కడి మాస్ అయ్యా!!🤩#iSaportHydra #HYDRAA pic.twitter.com/019oVT8DHj
— 𝕮𝖔𝖒𝖒𝖔𝖓𝕸𝖆𝖓 ✯✯✯ (@CommanM49388450) September 30, 2024
మొత్తంగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలను ఉన్నాయని గుర్తించారు. ఎన్నింటికి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. చాలా మంది కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, బ్యాంక్ లోన్ లు తీసుకుని మరీ ఇళ్లను కొనుగోలుచేశారని వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్న సమాధానాలకు.. గ్రౌండ్ లేవల్ జరుగుతున్న వాటికి పొంతనలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇలానే కూల్చివేతలు చేపడితే.. హైడ్రాపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం సీరియస్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలౌతున్నాడని కూడా సోషల్ మీడియాలోపలువురు పోస్టులు చేస్తున్నారు. అంతే కాకుండా..ఇప్పటి రాజకీయా నాయకుల ఒత్తిడిలకులోనై పనులు చేస్తే.. ఆ తర్వాత అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.
Read more: Hydra: కూల్చివేతలు కాదు.. దీని వెనుక మా టార్గెట్ అదే.. అసలు నిజం బైటపెట్టిన హైడ్రా రంగనాథ్..
దీంతో ఐపీఎస్ రంగనాథ్ ప్రస్తుతం దీనిపై తన తోటీ సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హైడ్రా వివాదస్పదంగా మారడంతో..దీనిపై బీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా బాధ్యతల నుంచి రంగనాథ్ తప్పుకొవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ కు సైతం.. ఇతర బాధ్యతలు ఇవ్వాలని కూడా కోరినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Hydra: హైడ్రాకు రంగనాథ్ గుడ్ బై..?.. హైకోర్టు చేసిన ఆ వ్యాఖ్యలే కారణమా..?... సంచలనంగా మారిన వీడియోలు..
రంగనాథ్ కు చివాట్లు పెట్టిన హైకోర్టు..
రేవంత్ కు బిగ్ షాక్ కు రెడీ అయిన కమిషనర్..