Adultery for Job Scam: బెంగళూరు: ఉద్యోగం కోసం ఎదురుచూసే యువతులను ట్రాప్ చేసి, వారిని హోటల్ రూమ్‌కి పిలిపించి వారిని మోసం చేస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూరులోని కోరమంగళకు చెందిన దిల్లీ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం పేరుతో యువతులను మోసం చేస్తోన్న టెకీ అరెస్ట్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ప్రసాద్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు ఫేక్ ఎకౌంట్స్ మెయింటెన్ చేస్తున్నాడు. అందులో కొన్ని మహిళల డిపిలు, మహిళల పేరుతో నిర్వహిస్తున్నవి కాగా ఇంకొన్ని మేనేజర్‌గా తనని తాను పరిచయం చేసుకుంటూ యువతులతో మాత్రమే చాటింగ్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూసే యువతులనే టార్గెట్ చేసుకునే ప్రసాద్.. వారితో పరిచయం పెంచుకున్న తరువాత వారిని మోసం చేస్తున్నాడు.
తనకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా పరిచయాలు ఉన్నాయని.. తనకు కాంటాక్స్ ఉన్న కంపెనీల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో ప్రసాద్ మోసాలకు తెరలేస్తుంది. హోటల్లో ఓయో రూమ్ బుక్ చేసి వారిని అక్కడికి పిలిపించుకునే ప్రసాద్.. హోటల్ గదిలో వారిని మాటల్లో పెట్టి వారిని సెక్సులో పాల్గొనేందుకు బలవంతం చేస్తాడు. బలవంతంగానే సెక్సుకి అంగీకరించేలా చేస్తాడు. లేదంటే ఉద్యోగ అవకాశం హుష్‌కాకీ అవుతుందని బెదిరిస్తాడు. ఉద్యోగం కోసం రాజీపడే యువతులు అతడి మాటలు నమ్మి శృంగారంలో పాల్గొంటే.. ఆ మొత్తం తతంగాన్ని వారికే తెలియకుండా కెమెరాలో రికార్డు చేసి.. ఆ ప్రైవేటు వీడియోలతో వారిని పదే పదే బ్లాక్ మెయిల్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
తన మాటలు వినకపోతే.. ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి వారిని లొంగదీసుకుంటున్న ప్రసాద్ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రసాద్ అరెస్ట్‌పై బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందిస్తూ.. ప్రసాద్ వద్ద 10 మందికిపైగా యువతుల వీడియోలు ఉన్నాయి అని స్పష్టంచేశారు. మహిళల ఫోటోలను డిస్ప్లే పిక్స్‌గా పెట్టుకుని యువతులను మోసం చేస్తున్నాడని.. ప్రసాద్ బాధితుల జాబితాలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువతులే ఉన్నారని ప్రతాప్ రెడ్డి మీడియాకు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రసాద్ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.