Bandla Ganesh Tweets Viral on Social Media: ఒకప్పుడు కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించి తరువాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. నిర్మాతగా మారిన తర్వాత చిన్న సినిమాలు చేయకుండా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. అలా ఆయన చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి హిట్లు తగ్గిపోయాయి అనుకుంటున్న సమయంలో ఆయన సినీ నిర్మాణం కూడా ఆపివేశారు. ప్రస్తుతానికి బండ్ల గణేష్ మళ్లీ నటుడుగా ఒకటి రెండు సినిమాలు చేశారు.
పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం సరైన పిలుపు రావడం లేదు, ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ చేస్తున్న కొన్ని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా బండ్ల గణేష్ ఎక్కువగా వేదాంతం మాట్లాడుతూ ట్వీట్లు చేస్తున్నారు. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే బండ గణేష్ ఇప్పుడు ఎందుకో గానీ వేదాంత ధోరణిలో ఎవరో తనను మోసం చేశారు అన్నట్లుగా ట్వీట్లు చేస్తూ రావడం హాట్ టాపిక్ అవుతోంది.
ఇక తాజాగా కూడా బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేశారు. ఆయన చేసిన ట్వీట్లు మీకు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ‘’ఎలుక రాతిదైతే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం, పాము రాతిదైతే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం, తల్లిదండ్రుల ఫోటోకు దండేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము, చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం, బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తే అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
అలాగే రాయిలో దైవత్వం ఉందనీ తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వం ఉందనీ గుర్తించలేక పోతున్నాం, జీవంలేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తి, ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదో? ఒకసారి ఆలోచించుకోండని అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. ‘’మనిషి వేసే ప్రతి అడుగు స్వార్థంతోనే.. ప్రతి మాట స్వార్థంతోనే.. పబ్లిసిటీ.. పబ్లిసిటీ.. పబ్లిసిటీ దీన్ని వదిలేసినప్పుడే మానవత్వం బయటకు వస్తుందని బండ్ల గణేష్ మరో ట్వీట్ కూడా చేశారు.
Also Read: Director Sagar Died: టాలీవుడ్లో మరో విషాదం.. అనేక మంది డైరెక్టర్లను అందించిన సాగర్ మృతి
Also Read: Pawan Kalyan Unstoppable: పవన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీములు.. దిల్ రాజును వాడుకుంటూ ఆహా ప్రమోషన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.