Top Music directors Quality less Music: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అంటే వెంటనే మనం చెప్పేది ఎస్ఎస్ థమన్, దేవి శ్రీ ప్రసాద్, అనిరుద్ మిగతా వాళ్లు టాప్ కాదా అంటే టాపే కానీ అందరికంటే ఎక్కువగా సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్లుగా వీరే ఉన్నారు. ముందుగా థమన్ విషయానికి వస్తే 2022 సంవత్సరంలో ఆయన దాదాపు 9 సినిమాలకు సంగీతం అందించాడు. ఆ తొమ్మిది సినిమాల విషయానికి వస్తే తెలుగులో సూపర్ మచ్చి, డీజే టిల్లు, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఘని, సర్కారు వారి పాట, థాంక్యూ, గాడ్ ఫాదర్, ప్రిన్స్ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించాడు.
అందులో డిజె టిల్లు, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, గాడ్ ఫాదర్ సినిమాలకు సంబంధించిన పాటలు మాత్రమే ప్రేక్షకులకు కొంత నోటెడ్ అయ్యాయి. అవి కూడా కొంచెం పెద్ద హీరోలు అలాగే యూత్లో క్రేజ్ ఉన్న హీరోలు కాబట్టి వారి పాటలు హిట్ అయ్యాయి. మిగతా సినిమాల విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాటి రిజల్ట్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక దేవిశ్రీప్రసాద్ విషయానికి వస్తే ఆయన కూడా గత ఏడాది దాదాపుగా 9 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
2022లో రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, f3, ది వారియర్, రంగ రంగ వైభవంగా, హిందీ దృశ్యం 2, సర్కస్ అనే సినిమాలకు ఆయన సంగీతం అందించారు. సర్కస్ అనే సినిమాలో ఒక పాటే అందించినా సరే అది ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎఫ్ త్రీ సినిమా తప్పితే ఆయనకు 2022లో సరైన హిట్టు ఒకటి కూడా లేదు. ఎఫ్ త్రీ కూడా పాటలు క్యాచీగా ఉండడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి అంటే ఒక రకంగా చూసుకుంటే అందరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లే మాకు కావాలని వీరి దగ్గరకే వెళుతున్న నేపద్యంలో క్వాంటిటీ పెరిగిపోయి క్వాలిటీ తగ్గిపోతోంది.
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది అని తెలుగులో ఒక సామెత ఉంటుంది అదే నేపథ్యంలో వీరికి సినిమాలు ఎక్కువైపోయి దేనిమీద కాన్సన్ట్రేట్ చేయాలో తెలియక అన్నింటికీ సగం సగం ఎఫర్ట్స్ పెడుతూ అందరికీ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా వారు ఎంచుకునే సినిమాలు, వారిని ఎంచుకునే దర్శకుల ఈ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో ఇంకా నాసిరకం మ్యూజిక్ ప్రేక్షకుల సో ఈ విషయంలో కాస్త దృష్టి పెడితే బాగుంటుంది.
Also Read: Taraka Ratna Latest Health Update: కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook