ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. రీసెంట్ గా శ్రీలంక, న్యూజిలాండ్ జట్లుతో జరిగిన వన్డే సిరీస్ ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ హైదరాబాదీ పేసర్ 729 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ 2వ స్థానంలోనూ, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానంలోనూ, మిచెల్ స్టార్క్ 4వ స్థానంలో ఉండగా, 5వ స్థానంలో రషీద్ ఖాన్ కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక బౌలర్ సిరాజ్ మాత్రమే.
🚨 There's a new World No.1 in town 🚨
India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥
More 👇
— ICC (@ICC) January 25, 2023
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇటీవల కివీస్ పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన శుభమన్ గిల్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో ర్యాంకుకు, రోహిత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నారు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
కివీస్ పై వన్డే సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ను వెనక్కినెట్టి అగ్రస్థానం కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్ లోనూ భారత్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుంది. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ను 2-0 లేదా అంతకంటే మెరుగ్గా గెలుచుకుంటే.. ఇక మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా నంబర్ వన్ గా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ జోరు.. నంబర్ వన్ గా హైదరాబాదీ పేసర్