Kamareddy Municipality Master Plan Issue: కామారెడ్డిలో రైతులు నెల రోజులుగా ధర్నా చేస్తుండటం, ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకుని ఆందోళన మరింత ఉధృతం అవడం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇక్కడి రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకముందే అధికార పార్టీ మేల్కొని నష్టనివారణ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌పై ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించారు. తన నివాసంలో ఆయన మీడయా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా ప్రతిపాదిత ముసాయిదాపై కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని గంప గోవర్థన్ ఆరోపించారు. 20 ఏళ్లకు ఒకసారి పెరిగిన జనాభా ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారని... అలాగే కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను న్యూఢిల్లీకి చెందిన డిడిఎఫ్ కన్సల్టెన్సీకి చెందిన సంస్థ తయారుచేయడం జరిగిందన్నారు.
కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ముసాయిదాకు కామారెడ్డి మున్సిపాలిటీ తీర్మానం చేసి పంపడం జరిగిందని వెల్లడించారు. అయితే, ఆ సంస్థ కామారెడ్డి మున్సిపాలిటీ పంపిన తీర్మానానికి వ్యతిరేకంగా మ్యాప్ రూపొందించిందని అన్నారు. ఆ సంస్థ తయారు చేసిన మ్యాప్ వల్లే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రైతాంగంను అయోమయానికి గురి చేసిందన్నారు. డిడిఎఫ్, డిటిసిపి సంస్థలకు చెందిన అధికారుల తప్పిదం వల్ల ప్రతిపాదించిన ప్రాంతాల్లో కాకుండా వాళ్లకు నచ్చిన ప్రాంతంలో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లు ఏర్పాటు చేశారన్నారు. ఆ సంస్థలు మున్సిపాలిటీ పంపిన తీర్మానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం మార్పు చేశారన్నారు.
కామారెడ్డి ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, జడ్పీ చైర్మన్ పదవులు చేసిన వారు సైతం ముసాయిదాను రద్దు చేయాలని విష ప్రచారం చేసి రాజకీయం చేస్తున్నారని అన్నారు. 2000 సంవత్సరంలో కేటాయించిన ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ నుండి ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా ఇప్పటి వరకు 22 ఏళ్లలో తీసుకుందా అని ప్రశ్నించారు. ఈ మాస్టర్ ప్లాన్ 2041 వరకు అమల్లో ఉంటుందన్నారు. 100 ఫీట్ల రోడ్లు సైతం మున్సిపల్ తీర్మానానికి వ్యతిరేకంగా డిజైన్ చేసి పంపడం జరిగిందన్నారు. ఇందువల్ల లింగాపూర్, టెక్రియాల్ గ్రామాల ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు.
ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తున్నట్టు ప్రకటించిన గంప గోవర్థన్.. ఏ ఒక్క రైతు కూడా అదైర్య పడవద్దనీ ఒక్క గుంట, ఒక్క ఎకరం ఏ రైతు దగ్గరి నుంచి తీసుకోమని హామీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ మాస్టర్ ప్లాన్‌కు మున్సిపల్ తీర్మానం చేసి పంపుతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులతో చర్చించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrest: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద బీజేపి ధర్నా.. పెనుగులాట మధ్యే బండి సంజయ్ అరెస్ట్
ఇది కూడా చదవండి : Revanth Reddy's Open Letter: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్.. విషయం ఏంటంటే..
ఇది కూడా చదవండి : Telangana Sankranti 2023 Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు 5, కాలేజీలకు 3రోజుల సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook