Upcoming CNG Cars: 2023లో రానున్న టాప్-5 సీఎన్​జీ కార్లు ఇవే...!

CNG Cars: కొత్త సంవత్సరంలో పలు సీఎన్​జీ వాహనాలు పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో మారుతీ, టయోటా, టాటా వంటి సంస్థలు తమ కొత్త వెర్షన్లును లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 10:36 AM IST
Upcoming CNG Cars: 2023లో రానున్న టాప్-5 సీఎన్​జీ కార్లు ఇవే...!

Top 5 Upcoming CNG Cars in india: గత కొన్ని సంవత్సరాలుగా CNG కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో మరిన్ని మోడల్స్ లాంచ్ చేసేందుకు ఆటో సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ సీఎన్జీ కార్లు పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి, ఇదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. ఎక్కువ మైలేజ్ కావాలనుకునేవారికి బెస్ట్ అప్షన్ ఈ సీఎన్జీ కార్లు. త్వరలో రాబోతున్న టాప్-4 సీఎన్​జీ కార్స్ ఏంటో చూద్దాం. 

మారుతీ బ్రెజ్జా ​ సీఎన్​జీ(Maruti Brezza CNG): 2023లో మారుతీ సుజుకీ ఎస్​యూవీకి సీఎన్​జీ వర్షెన్​ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. CNG కిట్‌తో కూడిన మారుతీ బ్రెజ్జా ఇటీవల కొన్ని డీలర్ యార్డ్‌లలో కనపించింది. ఈ ఏడాది మెుదల్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే ఎస్​యూవీ సెగ్మెంట్​లో మారుతీ లాంచ్​ చేసిన తొలి సీఎన్​జీ వాహనం ఇదే అయ్యే అవకాశం ఉంది. 
టయోటా హైరైడర్ సీఎన్​జీ (Toyota Hyryder CNG): టయోటా తన కొత్త హైరైడర్ కాంపాక్ట్ SUVని CNG కిట్‌తో తీసుకురానున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. దీని బుకింగ్స్ కూడా మెుదలయ్యాయి. ఇది  1.5లీటర్​ పెట్రోల్​, మైల్డ్​ హైబ్రీడ్ పవర్‌ట్రైన్‌ అప్షన్ తో మిడ్-స్పెక్ G, ఎస్ మోడల్స్ లో రానుంది. 
మారుతి గ్రాండ్ విటారా ​సీఎన్​జీ(Maruti Grand Vitara CNG): మారుతీ తీసుకొచ్చిన గ్రాండ్ విటారా గతంలో మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో ఎస్​యూవీ యెుక్క సీఎన్​జీ వర్షెన్​ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 

టాటా ఆల్ట్రోజ్ ​ సీఎన్​జీ(Tata Altroz CNG): CNG కార్ల రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి టాటా తన CNG లైనప్‌ని విస్తరించాలని యోచిస్తోంది. దీని కింద టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జిని తీసుకురాబోతోంది. 
టాటా పంచ్ ​ సీఎన్​జీ(TATA Punch CNG): నెక్సాన్​ తర్వాత టాటా మోటార్స్​లో అత్యధికంగా అమ్ముడైన రెండో కారు టాటా పంచ్. ఇప్పుడు దీని యెుక్క సీఎన్జీ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

Also Read: kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News