Chimney Exploded in Motihari: ఇటుక బట్టిలో పొగగొట్టం పేలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది వరకు గాయపడ్డారు. 10 మందికిపైగా కార్మికులు ఆచూకీ కనిపించడం లేదు. బీహార్ లోని మోతిహరి జిల్లాలో రాంగర్వ పోలీసు స్టేషన్ పరిధిలో చంపాపూర్ లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టిలో ఏర్పాటు చేసిన ఎత్తయిన చిమ్నీ పై భాగం పేలి, చుట్టూ ఉన్న కార్మికుల మీద పడింది.
ఈ పేలుడు ఘటనలో 25 మందిపై చిమ్నీ శిథిలాలు పడ్డాయి. పేలుడు ఘటనతో అప్రమత్తమైన జనం హుటాహుటిన వెళ్లి శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద వెలికితీశారు. అప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 9 మంది ఊపిరాడక మృతి చెందారు. గాయాలతో బయటపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇటుక బట్టిలో చిమ్నీ పేలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని మోతిహరి అధికార జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. ఇటుక బట్టిలో చిమ్నీ ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవం పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హాజరైన కార్మికులు, స్థానికులు చిమ్నీ చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు ఈ పేలుడు సంభవించింది. చిమ్నీలోంచి పొగ వెలువడటంతోనే పేలుడు సంభవించిందని.. 30 - 40 అడుగుల ఎత్తు నుంచి శిథిలాలు మీద కూలడంతో కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్టు స్థానికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఇది కూడా చదవండి : 5% GST on Rice: ఆ బియ్యంపై 5 శాతం జిఎస్టీ విధింపు
ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్
ఇది కూడా చదవండి : Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook