IND Playing XI for 1st Test vs BAN: మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్‌కు అప్పగించిన భారత్.. మరో సమరానికి సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా బుధవారం (డిసెంబర్ 14) నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే భారత్ ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాల్సి ఉంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా స్టార్ ప్లేయర్స్ ఈ సిరీస్‌కు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది.
కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. దాంతో లేటుగా వచ్చిన అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశే ఎదురవనుంది. గత కొంతకాలంగా గిల్ నిలకడగా రాణించడం అతడికి కలిసొచ్చింది. ఫస్ట్ డౌన్లో వైస్ కెప్టెన్ చతేశ్వర్ పుజారా ఆడతాడు. ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించిన పుజారా ఈ సిరీస్‌లో రాణిస్తేనే జట్టులో చోటు ఉంటుంది. నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నారు. ఇద్దరు మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం.
ఆరో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. బంగ్లా సిరీస్ పంత్‌కు పెద్ద అగ్ని పరీక్ష. పరుగులు చేస్తేనే జట్టులో కొనసాగుతాడు. పంత్‌కు సంజూ శాంసన్ నుంచి మాత్రమే కాదు ఇషాన్ కిషన్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తాజాగా తప్పించింది. ఈ నేపథ్యంలో పంత్ మెడపై కత్తి వేలాడుతున్నట్టే. ఇక వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడికి కలిసొచ్చే అంశం.
అక్షర్ పటేల్‌కు బదులు యువ స్పిన్నర్ సౌరబ్ కుమార్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్-ఏ తరఫున బంగ్లాపై 15 వికెట్లతో చెలరేగడమే అందుకు కారణం. దాంతో అక్షర్ పటేల్‌కు నిరాశే ఎదురుకానుంది. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఆడటం ఖాయం. మూడో పేసర్‌గా జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశవాళీలో దుమ్మురేపడంతో 12 ఏళ్ల తర్వాత ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కె పరిమితం కానున్నాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, సౌరబ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
Also Read: Nagakanya In Karimnagar: నేనే నాగకన్యను.. నాకు గుడి కట్టండి! పాములాగా యువతి వింత చేష్టలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.