Virat Kohli breaks Ricky Pontings Most International Centuries record: బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. ఎబాడోత్ హుస్సేన్ వేసిన 39వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ సిక్స్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. విరాట్ 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ.. మూడో వన్డేలో తన బ్యాట్‌కు పనిపెట్టాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు.
తాజా ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ వన్డేల్లో 44వ సెంచరీ నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను కోహ్లీ దాటేశాడు. పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 71 శతకాలు బాదాడు. దీంతో ప్రస్తుతం అత్యధిక సెంచరీల బ్యాటర్‌గా రెండవ స్థానంలో కోహ్లీ నిలిచాడు. తొలి స్థానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100) ఉన్న విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ ఆరో అరుదైన ఘనత కూడా సాధించాడు. బంగ్లాదేశ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర (1045) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగా రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐅𝐎𝐑 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 💥💯
He brings up his 44th ODI ton off 85 deliveries.
He goes past Ricky Ponting to be second on the list in most number of centuries in international cricket.
Live - https://t.co/HGnEqtZJsM #BANvIND pic.twitter.com/ohSZTEugfD
— BCCI (@BCCI) December 10, 2022
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీ బాధగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113) శతకం చేశాడు. వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 2, షకిబ్ 2, ఎబాడట్ 2 తలో రెండు వికెట్స్ తీశారు. బంగ్లాపై వన్డేల్లో ఇదే భారత్‌కు అత్యధిక స్కోరు. గతంలో 370/4 స్కోర్ అత్యధికం.
Also Read: ఆడుకుంటున్న పిల్లాడి వద్దకు భారీ కింగ్ కోబ్రా.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే వణికిపోతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.